STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవు...

నీవు...

1 min
341

విసుగును పోగేసుకున్నదేమో నా మనస్సు

తన్మయత్వం కోసం ఎదురురుచూస్తుంది


కాలలు మారి గడియాల్లోకి నిముషాలు మారి సెకనుల్లోకి రావాలంటే ఇక నీవు

 మాటల మంత్రాలు చదవాల్సిందే


నీవు నాలో ప్రవహించాల్సి oదే

నేను ఇక మారాల్సిందే ఊహకు ప్రాణం పోయాల్సిందే మనస్సును స్వర్గ సీమ చెయ్యాల్సిందే గుప్పిట పట్ట లేనివాటిని వదిలి వేయాలిసిందే 


మార్చలేని మనుషులను ఏమర్చలేక విసిగిపోయాను ఇక నువ్వే మారమని నా మనస్సుకు సర్ది చెప్పాలిసిందే 


 వేల క్షణాల అనoదపు ఛాయలు కోరడం లేదు ఎంత బాధనయినా మరిచే నీ మాటలు కొన్ని క్షణికాలయినా చాలంటాను


నీ మాటలు తుమ్మెదరెక్కలు తోడిగి నన్ను అలరిస్తాయో వలపు బాణాలు విసురుతాయో లేక ఏ రాణి వాసపు రాచరిక  ఆనందం కోసం ఆస్తానపు కవులు లిఖించి రాజ్యములో అలరిoచినట్టు నా మోముపైనా చిరునగవులు విరిపిస్తాయో ఇక నీ ఇష్టం వీరా 


పట్టి ఉంచలేను వదిలివెయ్యలేను  కానీ ఊహల్లో నిన్ను తగ్గించలేను నా మనసు మోసే మహా రాణి నీవు 


Rate this content
Log in

Similar telugu poem from Romance