నీ ప్రేమ పలకరింపుకై
నీ ప్రేమ పలకరింపుకై
నీ ప్రేమ పలకరింపుకై
మరీ మరీ తపిస్తుంది నా మనసు
నా ఆరాటమంతా నీవు పంచే ప్రేమకై
కేవలం నీ మమతానురాగమే
కోరుకుంటుంది ఈ పిచ్చి హృదయం
జన్మ జన్మలకి నీవే నా ఆరాధ్య దైవం
నీ చెలిమి పదే పదే కోరుతుంది నా హృదయం
నా ప్రాణంగా నిను ప్రేమిస్తూనే ఉంటా
నా ఊపిరి ఆగే వరకూ
నా ప్రతి సంతోషం నీవే,నా దుఃఖం నీవే
నా భావాలన్నీ నీతో పంచుకోవాలని కాంక్షః
నా హృదయ కావ్యం నీవే అని ఎలా ఎలా తెలుపను

