Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ మనసు చూపులు..

నీ మనసు చూపులు..

1 min
261



నువ్వోచ్చేదాక విరహం తోడుంటానంది 


నువ్వొచ్చాక నీ మనసు తోడయింది.


నువ్వు నాలో కలిసిపోయావు 


ఒక శ్వాసలా నీ ఆలోచనలు నాలో చేరుస్తూ. 


నీ చూపులు తగిలి గుండె గది వెలుగుతుంది. 


అందులో ఒకసారి తొంగి చూడు ప్రియా నీ రూపే కనబడుతుంది. 


నువ్వే నేననుకున్నా నీ నవ్వే నేనవాలనుకున్నా. 


కనులకు కనబడకున్నా మనసు కళ్ళతో చూస్తున్నా 


నీ రూపాన్ని నీ సమక్షంలో వదిలేసిన మనసుని. 


ఊహల రెక్కలకు ఇంద్రధనస్సుని కట్టి 


ఆశల సౌధంతో అంబరానికి ఎగిసి చేస్తున్నాం 


భావ సాగర మధనం మన మనసులని 


తడిమి తడిపే చూపుల ఒక బంధం. 


ప్రియా ఇదోక మాయ నీ మనసు చూపుల వల 


నీ చూపుల కౌగిలిలో నీ భావాల చూపులలో 


ప్రేమకి మైమరిచిపోయి నన్ను నేను మరిచిపోయి 


నీ వెంటే పయనిస్తున్నా నా మనసే నీదని చెప్పకనే చెపుతున్నా. 


మనసుని పట్టుకున్న నీ రూపం మంత్రంలా


 నన్ను నీ చేరువలో నిలిపేస్తుంటే. 


నా మాట నా మనసు నీకు నా ప్రేమ తెలియచేసేది. 


ఎలా అని. నీలోనే నే కలిసిపోవాలని నీ చూపులో నిలిచిపోవాలని.


 నీ మనసు చూపులో బంధీనయ్యానని ఎలా తెలిపేది...

... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance