ఎప్పుడైనా
ఎప్పుడైనా
మాటకెంత బలముందో..వాడనపుడు తెలుస్తుంది..!
కోరికెంత దుర్భరమో..తీరనపుడు తెలుస్తుంది..!
మేలమాడు మల్లియలను..చూశావా ఎపుడైనా..
చెలినవ్వుల లేవెన్నెల..చిక్కనపుడు తెలుస్తుంది..!
చెలి అందెల రవళులకథ..విన్నావా ఎపుడైనా..
గుండెచాటు ఆవేదన..జారనపుడు తెలుస్తుంది..!
ప్రేమన్నది లోకంలో..కన్నావా ఎపుడైనా..
నాదనేది భావనలో..మిగలనపుడు తెలుస్తుంది..!
భూమిమీద నీ విలువను..కట్టావా ఎపుడైనా..
పదవైనా డబ్బైనా..ఉండనపుడు తెలుస్తుంది..!
శ్వాసమాటు మధువేదో..గ్రోలావా ఎపుడైనా..
మనసుతోటి తాదాత్మ్యత..చెందనపుడు తెలుస్తుంది..!