నీ కథను
నీ కథను
ఈ తోటలో గాలి..పలికేను నీ కథను..!
ప్రతిఆకు ప్రతిపూవు..పాడేను నీ కథను..!
ఈ తనూ వీణలో..రాగాలు శతకోటి..
ప్రతికణము ముద్దుగా..దాచేను నీ కథను..!
ఆడేటి మెఱుపులే..మురిపాల దీపాలు..
ప్రతిశ్వాస శ్వాసలో..పొదిగేను నీ కథను..!
ఒకమాయ మాయగా..మాయమే అయ్యెనే..
ప్రతిచినుకు గుండెలో..అల్లేను నీ కథను..!
నిప్పులో ఉప్పులో..నీడలో మెలకువే..
వానలో వెలుగులో..చిందేను నీ కథను..!
మాధవా కురిపించు..రవ్వంత నీ దయను..
అక్షరాల గజలింట..మలచేను నీ కథను..!

