నీ చూపది
నీ చూపది
నీ చూపది కురిసే వెన్నెలగానే మారుతోంది..!
బ్రతుకుటాశ పెంచు నెలవంకగానే మారుతోంది..!
గజలంటే గోర్వెచ్చని..ప్రణయవీణ సందడియే..
అది తెలియక ఒకగుండె ఘోషగానే మారుతోంది..!
ఎంతగానొ ఊరించే..ఆవేదన తెలుపరాదు..
తపమంతా తపనపడు పాటగానే మారుతోంది..!
కాలమనే మధువేమో..కాల్చేనట మనసుగొడవ..
నేర్చుకునే ఆశయం ఆటగానే మారుతోంది..!
అక్షరాల ఆకాశం..వెక్కిరించ దెవ్వరినీ..
తనమౌనం ప్రతిమదికి ఊటగానే మారుతోంది..!