STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ చిలిపి మాయలో

నీ చిలిపి మాయలో

1 min
369

తలచగా నేనెచట..మైమరపు వాడలో..! 

చూడగా నా మనసు..నీ వలపు పాటలో..!


ఏదిరా నీ జాడ..చెప్పదే ఏ పొదా.. 

ప్రేమకే దిగులాయె..నీ చెలిమి మేడలో..!


మరిగేను నా గుండె..నినుచేర దాహాన..

లేదందు మోహమే..ఈ వెలుగు వానలో..!


ఏ వంక చూసినా..నీవె నా నెలవంక.. 

చిత్రమే ఈవేళ..మురిపించు ఊహలో..!


పెంచేవు తాపమే..తెలియదే ఎందుకో..

నిలిపేవు వేడుకా..రాగాల తోటలో..!


తాళగా కుదరదే..ఈ విరహ వేదనను..

పడిపోతి నెప్పుడో..నీ చిలిపి మాయలో..


Rate this content
Log in

Similar telugu poem from Romance