నేను --నేను
నేను --నేను
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఎన్నేళ్ళో ఎదలో దాగిన లక్ష్యం
మూలన పడి దుమ్ము పట్టి
కనుమరుగయ్యే క్షణం...
ఎందుకో ఓసారి దుమ్ము దులపాలనిపిస్తే...
ఎందుకు మొదలుపెట్టానోనన్న ఆలోచన
చెదపురుగులా మొదలైంది ...
ఆటుపోటులు ఉన్నాయని
ప్రయాణం ఆపేశానా అని ప్రశ్నించుకున్నా...
కష్టాలు కన్నీళ్లు
ఎదురుదెబ్బలు
ఎదురీత ఇవన్నీ... ప్రతిబందకాలని...
సాధన మరచి
సాధించాల్సినది మరచి
బ్రతుకు మాయలో పడిపోయానా...
ఎందుకో ఒక్కసారి మళ్ళీ...
లక్ష్యం వైపు అడుగు వెయ్యాలనిపించి
ఆలోచనలకు పాదరసాన్ని జతకలిపా...
వ్యాయామం తో శరీరాన్ని ఉక్కులా మార్చుకున్నా...
ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం మార్గాన్ని ఎంచుకున్నా...
లక్ష్యం వైపు అడుగులు వెయ్యడానికి
వైఫల్యాల నుంచి నేర్చుకుంటూ
వెన్నుపోటుదారులను దూరం చేసుకుంటూ
పదే పదే వెనుకడుగు వేయించే మనసుకు
కళ్లెం వేసి ముందుకు నడిపిస్తున్నా....
లక్ష్యానికి అడుగు దూరంలో...
కన్నీళ్ళకి సెకను దూరంలో...
పడ్డ కష్టాన్ని మరచి... విజయోత్సాహంతో...
సాగిపోతున్నా...
ఎవరో కాదు అది...
లక్ష్యాన్ని చేరి
మును ముందుకు
అడుగులు వేస్తున్న కార్యసాధకుడను...
నేనే...నేనే..

