నాప్రేమ అమరం..
నాప్రేమ అమరం..
ఎప్పుడో ఒకరోజు ఎక్కువ ప్రేమించి
మిగిలిన రోజులు తక్కువ ప్రేమించడం
నాకు చేతకాదు
అప్పుడప్పుడూ గుర్తు చేసుకుని
అస్తమానూ మరిచిపోవడం నావల్లకాదు
ఒకప్పుడు ఒకలా మాట్లాడి
ఇంకోసారి వెరొకలా అన్వయించడం
నాకలవాటు లేదు...మనసే నీదంటూ ఇచ్చేశాను...
మౌనమే భాషంటూ మిగిలున్నాను...
కన్నుల్లో నీరూపం కాటుకయ్యింది...
వీనుల్లో నీస్వరమే రాగమయ్యింది...
మానసాన నీ నామం దివ్వెయ్యంది
అనుక్షణమూ నీఊసే ధ్యాసయ్యింది...
నీకెలా తెలిపేది నాతపస్సునే...
నేనెలా చేరేది నీసమక్షమే...
అలుపంటూ రాదే అంతంటూ లేదే...
లోలో రేగే తమకంనాలో నీవే గమకం...
నాకై నీరాకే మధురం నీపై నాప్రేమే అమరం...
... సిరి ✍️❤️

