నాన్న ప్రపంచ
నాన్న ప్రపంచ
కుటుంబానికి పెద్దదిక్కుగా మారిపోతాడు.
బరువు బాధ్యతలు మోస్తాడు మౌనంగా.
కష్టాలను ఇష్టంగా అనుభవిస్తాడు.
ఎదిగే కొద్ది ఒదిగి ఉంటాడు.
కోపం తో కసిరిన ప్రేమ గుణం తనది.
ఎన్ని సమస్యలున్నా చక్కదిద్దుతాడు.
ఏ విషయం లో తక్కువ కానీయడు ఎప్పుడు.
ఆయనకు సాటిరారు ఎవ్వరు.
బహుదూరపు సారసారి.
కుటుంబామే ఆయన బలం.
శిఖరామంతా ఓపిక సహనం.
కోపమంతా పైకి చూపిస్తూ లోలోన అన్ని దాచుకుంటాడు.
ఇష్టాలను సైతం దాచుకునేస్తాడు మది లో.
ఎన్నో విషయాలు తెలిసిన మౌనం వహిస్తాడు.
అలుపెరుగని యోధుడు.
అలుపు రాని మహనీయుడు.
చిమ్మ చీకట్లో వెలుగులు పంచుతాడు.
మొదలు పెడితే ముగించే వరకు పోరాడుతాడు.
ఇష్టాలను సైతం దాచుకునేస్తాడు గుండెల్లో.
తాన కోసం కాదు వాళ్ళు తాన ప్రాణం.
గమ్యాలను సైతం చేరుకోవడం కోసం తనకి తాను
శిల్పిగా మారిపోతాడు.
నాన్న జీవితం ఎందరికో ఆదర్శం.
సాటిరారు ఆయనకు ఎవరు.
చరిత్రలో ఎప్పుడు వెలుగొందే ధృవతార.
మొదటి నుంచి చివరికి వరకు నాన్నే.
నాన్న గురువు నాన్నే ప్రపంచం.
ఎందరున్నా నాన్న లేకుంటే వెలితి జీవితానికి.
మనల్ని ముందుండి నడిపి వెనుకుండిపోతాడు ఎప్పడు.
