నాలో నేను, నాతో నేను
నాలో నేను, నాతో నేను


కత్తులుండవు, శరములుండవు మనోబలమను ఆయుధము తప్ప
రథములుండవు, కరి నర గణములుండవు కనురెప్పలార్పనివ్వని నా కర్తవ్యదీక్ష తప్ప
సైనికులెవ్వరు లేరు సాక్షీభూతముగనున్న నా శరీరము తప్ప
రణభూమి ఏదో కాదు, రేయి పగలేరుగని నా ఆలోచన తప్ప
శత్రువులెవ్వరొ కాదు చంచలమైన నా మనస్సు తప్ప
సలిపెద రణము సాయుధుడనై మనోస్వా੦తన చేకూరునంతవరకు