నా ఊహల ఊసులు - 3
నా ఊహల ఊసులు - 3


ప్రేమ పక్షులు..
ఆ పక్షులకు రెక్కకు రెక్క భరోసా..
కను రెప్పలు రెండు.. మూసినా తెరచినా మళ్ళీ విడిపోతాం అన్న భయం.. మళ్ళీ కలుస్తాం అన్న ఆశ తో బ్రతుకుతాయి..
ద్వేషం పలికే పెదవులలా కాకుండా ప్రేమను పలికే పెదవుల్లా కలసి జీవితాంతం ద్వేషాన్ని దూరం చేసుకుంటూ ప్రేమ దరి చేరుతూ..
చాచిన రెక్కలు ముడవకుండా..ఎగిరినంత దూరం అలవకుండా..ఈ ప్రేమ పయనం సాగించాలని నా కోరిక..