నా స్వప్నంలో
నా స్వప్నంలో
కనురెప్పల మాటున దాగిన నీ రూపం..
అనునిత్యం నా స్వప్నంలో నీ మోమే దర్శనమిస్తుందే..
నీ దూరం మహా చెడ్డది అని మనసుకి తోస్తుంది..
ఆ దూరమే నీ మీద ప్రేమను పెంచింది..
నీలో నా ప్రాణం ఉందని నాకేపుడో తెలిసినది..
నీ జ్ఞాపకాలే నా ఊపిరి అయినవి..
ప్రతి నిమిషం నీ తలపులతో నా మనసు నీ చుట్టూ తిరుగుతుంది..
నా గుండె నీ ఊహలతో సతమవుతుంది..
కొత్తగా ఈ కలవరపాటేమిటో మనసా...
ఎందుకో మది నీ కోసం తెగ ఆరాటపడుతుంది..
నాలో మొత్తం గా నువ్వే నిండిపోయావు...
నాకే నేను లేకుండా నను నీలో కరిగించావే..

