STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా మనస్సు కి

నా మనస్సు కి

1 min
224

లోకమంతా నిదరోయింది

నిదురరాని నా కనులకు కాలం కరగక నిట్ట నిలువునా నిలబడిపోయింది ప్రకృతి కూడా పరవశించడం లేదు కొమ్మలు కదలడం లేదు

గాలి బిగస్సుకు పోయి ఊపిరి సలపడం లేదు 


అదిగో అప్పుడే తానొచ్చాడు  తన మాటలు వినాలని ఉత్సకత మొదలయ్యింది

నా మనసుకు అప్పుడే వేకువచ్చింది 

తన స్వరం నా చెవులు వింటున్నప్పుడు మనసేందుకో హాయిని పంచుకుంది


నన్ను వీడి ఎప్పుడో వెళ్లి పోయిన

నామనస్సు మరలా నన్ను వచ్చి చేరింది తాను బాగున్నాడనే

ఒక్క మాట తప్ప ఇంకేమి వినాలనిపించలేదు నా మనస్సుకు అడగాలని అడగలేక పోయిన నన్ను తానైనా అడగవచ్చుగా


నా కనుల వెంట కారే వేడి కన్నీటి రెండు చుక్కల వేడి సెగ తనను తాకిఉంటే తెలిసేదేమో నాకు తానంటే ఎంత ప్రేమో తన రాకకోసం ఎదురు చూస్తూ ఉండే నా మనస్సుకు తెలుసు


మన ప్రేమ మన ఇరువురి మనస్సుల్లో ఎంతగా అపురూపతను నింపుకున్నదో


ప్రతీ జన్మ మన కోసం ఇలాగే ఉండి పోతుంది బంగారం


Rate this content
Log in

Similar telugu poem from Romance