నా హృదయం
నా హృదయం
నీ కోసం వేచియున్న..రాధికలా నాహృదయం..!
నీపూజకు నవమల్లెల..మాలికలా నాహృదయం..!
తడబడు నా మాటలతో..తూచలేను నీ మహిమను..
నినుపొగడగ పొంగుతున్న..గీతికలా నాహృదయం..!
ఏ పున్నమి వెన్నెలైన..సాటి ఎలా నీ నవ్వుకు..
నిను చూస్తూ ఉండిపోవు..చంద్రికలా నాహృదయం..!
సృష్టిలోని కణకణమూ..నీ సుందర ఆలయమే..
నీవు చేరి నాట్యమాడ..వేదికలా నాహృదయం..!
నా కలలను పండించే..నీ కలయే ఈ జగమే..
నీ చూపుల వానసాక్షి..మౌనికలా నాహృదయం..!
ఎదురుచూపు మాధుర్యం..తెల్పు మాటలేవంటా..
నిజవసంత వేళలలో..సారికలా నాహృదయం..!