STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

గడిచినా కాలం గతమైనిలిచె

గడిచినా కాలం గతమైనిలిచె

1 min
135


మా బాల్యంలో 

సారా పీపానే దీపమై 

మాయింట వెలుగును నింపేది


మేం బడికెళ్ళే దినాల్లో 

చినుకులు పడిన చొక్కకు పిన్నీసే

ఆపద్బాంధవుడై మా మానం కాపాడేది


రవాణా సౌకర్యమే లేని 

మా కాలంలో మా కాళ్ళే 

రథ చక్రాలై మైళ్ళని చేధించి గమ్యం చేరేవి


హీటర్లు గ్రీజర్లు లేని 

మా రోజుల్లో కట్టెల పొయ్యే

మాకు ఆసరై కష్టాన్ని మా,తీర్చేది...! 


ఆనాటి మా బాల్యం  

ఓ సుమధుర ఘట్టం  

దాని తలచుకున్నపుడల్లా 

మా మది చిగురిస్తుంది

గగన తీరాన పక్షిలా విహరించాలనిపిస్తుంది 


కానీ మేం ఎంత ఆశపడినా 

తారసపడినా...

ఆ రోజులు ఎన్నటికీ మరలిరావు

గడిచినా కాలమంతా 

గతమై దర్శనమిస్తుందే అంతే...! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance