STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు పలికే

మనసు పలికే

1 min
255

ఉరుకులు పరుగులు..నిలుపుట నయమే..! 

పయనము లేదని..తెలియుట నయమే..! 


మనసే అడ్డము..మనసే అద్దము.. 

మసి తుడిచేపని..చిక్కుట నయమే..! 


ప్రేమ ఫలములా..కాయవు చెట్లకు.. 

ఎఱుకను చక్కగ..అందుట నయమే..! 


నిప్పుల కుంపటి..ఉన్నది వరమై.. 

తప్పుల తడకలు..కాల్చుట నయమే..! 


న్యూనత దేనికి..శ్రమలో విరియగ.. 

బుద్ధికి సిగ్గును.. నేర్పుట నయమే..! 


కోర్కెల చిలుకలు..రేపును అలజడి.. 

కలవర రాశిని..వీడుట నయమే..! 


మనసు పలికే ..నిర్మల తీర్థము.. 

మరువక మధువుగ..గ్రోలుట నయమే..!


Rate this content
Log in

Similar telugu poem from Romance