మనిషి కాలవని మనసు
మనిషి కాలవని మనసు
భుజం భుజం కాలవని మనుషులు....
దగ్గరకు వస్తే ఎం అడుగుతారో అనే భయం....
అవసరం కోసం నీ వెనుక వెనుక.....
పైనా ఒక్కటి పెట్టుకొని లోపల తియ్యని మాటల నటన....
ఎటుచూసినా స్వార్థం నాకు ఎం లాభం అని ఆలోచన....
మనుషులంత ఒక్కటే ఆలోచనలు వేరు వేరు.....
ఒక్కరు బాగుపడుతుంటే మరొకరు కుల్లుకునే మనస్తత్వలు..
పైన పైన ప్రేమలు గొంతు కదిపే మాటల ముఠాలు....
కలసిరాని కాలమ్ తో కలసి లేని మనసుల హోరులు...
స్వార్థం అనే నీడ నా ముఖానికి రంగులు వేసుకొని నటించే
మనుషులు.....
పోయేవరకు పంతలు పట్టింపూల కోపతాపాల ఆక్రోశ జీవితాలు....
చివరకు చితిమీద శవమాయే నీ దేహం......

