STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

మగ్గం

మగ్గం

1 min
3


కష్టాలను కన్నీళ్ళను..నేస్తున్నది మగ్గంపై..!

పడుగుపేక బడుగుబతుకు..పెడుతున్నది మగ్గంపై..!


చేనేతకు చేయూతను..ఇచ్చువారు కానరారె..

మౌనముగా తపమెంతో..చేస్తున్నది మగ్గంపై..!


నిరాశనే ఎండగట్టి..నడుంకట్టె నారీమణి.. 

తననిశ్చల ధ్యానంలో..తానున్నది మగ్గంపై..! 


కట్టుబొట్టు మారిపోయె..కట్టుబాట్లు చెదిరిపోయె..

వ్యథాభరిత కథనువీడి..కూర్చున్నది మగ్గంపై..! 


తనమనస్సు చిక్కబట్టి..చిరునవ్వుల పువ్వైనది.. 

పల్లెఉనికి పాట తనే..అవుతున్నది మగ్గంపై..! 




Rate this content
Log in

Similar telugu poem from Classics