మారింది కాలం...
మారింది కాలం...
పడమట ఉదయించడం లేదే
ప్రభాకరుడు
తూర్పున అస్తమించడం లేదే
దివాకరుడు
తిరుగుతూనే ఉందే
భూమి గుండ్రంగా
ఏమి మారింది కాలం?
కాలం మారింది కాలం మారిందని
కనులెర్ర చేస్తావేం?
కాలాన్ని దూషిస్తావేం ?
వాలం చుట్టుకున్నావ్ నీవు
కల్లు త్రాగిన కోతిలా
నిప్పు త్రొక్కిన వానరంలా
చిందులేస్తున్నది నీవు
వారసత్వపు వెకిలి వేషాలు వేస్తున్నది నీవు
మారింది కాలం అంటావేం?
సారాకు లొంగి పోయావు
బిరియానీ పొట్లానికి ఆశపడ్డావు
చెయ్యి చాచావు నోటుకై
ఓటు వేసావు
ఇప్పుడెందుకు శాపనార్ధాలు?
దోచుకుంటున్నాడు
దాచుకుంటున్నాడు
గోడలు దూకుతున్నాడు అని?
మారింది నువ్వు కాదా
కాలమా?
ఖరీదైన కల్లు త్రాగావు
మరీ మార్జువానా మ్రింగావు
మత్తులొ రెయంతా రికార్డు దాన్సు చేశావు
హత్తుకున్నావు ఎవడినో
కడుపు తెచ్చుకున్నావు
గర్భోత్పత్తి కర్మాగారంలో కార్మికురాలిగా
నీ ఫ్యాక్టరీ ఉత్పత్తిని
నువ్వే విసిరేశావ్
కుక్కలకూ కాకులకూ
వెక్కిరించావు సమాజాన్ని కోతిలానే
మారింది నువ్వా కాలమా యువతీ?
నవీన నవ యువతీ?
చూపకమ్మా నీ గుప్త దేహాన్ని
కప్పుకోమ్మా కానరాకుండా అని నేనంటే
నాపై దాడి చేయించావే
నీ మహిళా సంఘాలతో!
మార్పు ఎవరిది చెప్పమ్మా!
చండాలపు చిత్రాలు చూచి
ముండ సీరియళ్ళు ముందు పీఠమేసి
మొగుడిని మట్టు ఎలా పెట్టాలో
నేర్చావు బాగానే......
మదనపు మత్తులో
మరొకడిని మరిగి
కాలం చెప్పలేదే అలా అఘోరించమని
వారు నరానికి ఎక్కించిన
మతం సూదిమందుతొ
అందంగా వుంది అదే బొమ్మని
గట్టిగా గుద్దావే నీ ఓటు!...
... సిరి ✍️
