LIFE
LIFE
LIFE
చెప్పలేదు అమ్మ
ఈ లోకం కనిపించేంత అందమైనది కాదు అని…
చెప్పలేదు అమ్మ
ఈ లోకం లో నమ్మకానికి ఆయుషే లేదని…
చెప్పలేదు అమ్మ
మనుషులు అంత గొప్ప నటులు అని…
బాగుండేది
ఆ రోజు అమ్మ గర్భం లో ఉండిప్పుడు…
బయటికి వచ్చి చీకటిని జయించొచ్చు అనుకున్నా
కాని జీవితంలో వెలుతురు కోసం యుద్ధం చెయ్యాలి
అని తెలుసుకోలేకపోయా…
బయటికి రావాలి అని ఆశపడా
అమ్మ గర్భం నుండి
తిరిగి వెళ్లలేము అని తెలియక…
బాగుండేది
ఆ రోజు అమ్మ ఒడిలో అడుకున్నప్పుడు…
నడవాలి అనుకున్నా
జీవితంలో యెదగడానికి
తెలుసుకున్న ఆ నడక అంత సులువు కాదు అని…
మాట నేర్చుకున్నా
మనుషులతో కలవడానికి
కాని మౌనంగా మిగిలిపోయా కొన్ని ప్రశ్నలకి…
తిరిగి వెళ్లలేము కదా
ఆ రోజులకు, అందమైన
ఆ చిన్ననాటి బాల్యానికి…
ఇంతేనేమో జీవితం అంటే
— Anjali Manchinilla
