STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

లావణ్య ప్రతిమ

లావణ్య ప్రతిమ

1 min
15

లావణ్య ప్రతిమ.
( వచనకవిత.)

ఘనుడుగు విశ్వకర్మచే సృష్టింపబడినదీ భామ.
కనుచూపుతో ప్రణయాగ్నిని సృజంచు తిలోత్తమ.

సుందోపసుందుల నిర్జించుటకై వెడలినదీ లేమ.
అందానికి నిర్వచనమైనదీ నవ లావణ్య ప్రతిమ.

మెరుపు వోలె తళుకు మనెడి సౌందర్య మద్భుతం.
పరువముతో నడయాడు తరుణి చైతన్య మపూర్వం.

దూర్వాస మహర్షిచే శాపగ్రస్తయైనదీ కలికి దివ్యాంగన.
పార్వతీదేవి భక్తురాలీ కళ్యాణి బాణుని సుతయన.

ఉషాకుమారిగా ననిరుద్ధుని చేపట్టిన సుకుమారీ తరుణి.
తుషారపు బిందువు వోలె దీపించు స్నిగ్ధ జ్యోతి స్వరూపిణి.

హరి వంశమున మెట్టినదీ ఉషా బాలికదే భాగ్యమనగ.
తరియింపగ తన జన్మ మసలుకొనె నుత్తమ సాధ్వియనగ.

సుతుడుగు వజ్రనాభుని వీరునిగా తీర్చి దిద్దిన ధీర వనిత
అతులితమైన యశముతో వైకుంఠము చేరినదీ సురనుత.

తిలోత్తమ చరితము తల్చిన భక్తులకు కల్గు పుణ్యము.
పలుమార్లు హరినామము స్మరింపగా దక్కు ముక్తి ఫలము.//
**************************


Rate this content
Log in

Similar telugu poem from Classics