కలలు కురిసిన కనులు
కలలు కురిసిన కనులు
కలలు కురిసిన కనుల వెన్నెలైపోయావు
కనులు విప్పిన క్షణము మాయమైపోయావు
సరసపద్యాలున్న కావ్యమైపోయావు
పెదవితో చదివితే అర్థమైపోయావు
మనసు విచ్చిన వేళ చినుకులై కురిసావు
మెరిసేటి ముత్యముల రాశివైపోయావు
విరహాలు పోయాక మేనిలో శైత్యమే
తాపాన్ని చల్లార్చు గంధమైపోయావు
చంద్రశకలము రాలి నీరూపు దాల్చింది
శిల్పి చెక్కని చలువశిల్పమైపోయావు
రాతిగుండెలలోన వలపు సలిపేస్తోంది
పూవులను సంధించు చాపమైపోయావు
కాలుడే వెనుదిరిగిపోవాలి
నేనొదులుకోలేని ప్రాణమైపోయావు

