కలలసుందరి...
కలలసుందరి...
మదిలో రాసుకున్న కవితా సుమాల మాలికవో
ఎన్నటికీ వసివాడని పున్నాగపూల పరిమళానివో
చల్లగ మేనిని తాకే వాసంత సమీరానివో
సాయంకాలమున కనువిందు చేసే
అందమైన సాగరతీరానివో
వేసంగి ఎదలో మల్లెలు పూయించే పూబాలవో
శరత్కాల వెన్నెలలో నవ్వులు చిందించే చంద్రికవో
మనసును మైమరపించే రాగాలు పాడే నవరాగిణివో
హృదయమును నీ వైపుకు లాగే
అద్వితీయ సౌందర్యానివో
కనుల సైగతో కవ్వించే కలల సుందరివో
కాలాలు మారిన ప్రేమ తరగని అమర ప్రేమికవో

