జ్ఞాపకాల
జ్ఞాపకాల
మేలుచేయని జ్ఞాపకాలకు..హారతిచ్చుట తప్పుకాదే..!
గాయపరచే వారులేరని..తెలిసిబ్రతుకుట తప్పుకాదే..!
కలతపడితే ఒరుగునేమిటి..కలతపెడితే మిగులునేమిటి..
బాధలన్నీ గురువులేనని..తలచిమసలుట తప్పుకాదే..!
ఎవరికోసం ఏదియాగదు..ఎవరిగొప్పలు ఎంతకాలం..
ఇంతజ్ఞానం ఎఱుకలోనే..నిలిపియుంచుట తప్పుకాదే..!
ప్రేమకన్నా అసలుమాయే..లేదునిజముగ లోకమందున..
ప్రేమకొరకై చెలిమిమీరా..ప్రాణమిచ్చుట తప్పుకాదే..!
స్వర్గమేదో ఎక్కడుందో..వెళ్ళివచ్చిన వారలెవ్వరు..
పసిడినవ్వుల చిన్నిపాపగ..మదినినిలుపుట తప్పుకాదే..!
పదవికోసం అడ్డదారుల..బుద్ధికన్నా మురికియేదో..
దిక్కతోచని ఓటుమనసే..పోరుసల్పుట తప్పుకాదే..!
లోనదాగిన మాధవునితో..మాటలాడుట ఎంతమేలో..
అన్నితెలిసీ తెలియనట్లుగ..మిన్నకుండుట తప్పుకాదే..!

