STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

జీవితం

జీవితం

1 min
344


బ్రతుకు తీపి తీర కనే కరిగిందని తెలియలేదు!

తనువుపైన వయసు వచ్చి వాలిందని తెలియ లేదు!


అమ్మ ఒడిన బాల్యమలా కళ్లముందు తిరుగు తోంది

స్వర్గానికి చిరునామా దొరికిందని తెలియ లేదు!


వేలు పట్టి నడిపించిన నాన్న నెలా మరువ గలను

సాగరమే మౌనంగా కదిలిందని తెలియ లేదు!


ముచ్చటపడి అల్లుకుంటి ఓ మమతల సాలె గూడు

జీవితమే ఓ కథ లా మారిందని తెలియ లేదు!


అనుభవాల పొదరింట్లో పరిచయాల పరిమళాలు

స్నేహ మనే పూల కొమ్మ వాడిందని తెలియ లేదు!


ఉదయానికి అస్తమయం ఒక తీయని సంతకమే

తెలవారక ముందు పొద్దు వాలిందని తెలియ లేదు!


Rate this content
Log in

Similar telugu poem from Romance