STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

ఇది నేటి ప్రపంచం

ఇది నేటి ప్రపంచం

1 min
1


ఎండిన డొక్కలు 

మాడిన బ్రతుకులు 

నిరాశ నిస్ప్రుహలు నేస్తాలు 

మారని జీవితాలు 

వర్షించని మేఘం 

కరుణించని పాడిపంటలు 


రెక్కాడని రోజులు 

పస్తులతో నిదురపోతూ...

మంచినీళ్లు తాగుతూ...

కొంచెం ఎంగిలి దొరికితే బాగుండు అన్న ఆలోచనలు...

పసి కడుపులు నింపొచ్చు అనే తాపత్రయం...

కన్నం వేసే ఆలోచన ఒక వైపు 

మనిషినని గుర్తుచేసుకుంటూ మరో వైపు...


హృదయం ఎప్పుడో భూమిలాగ నెర్రెలు చీలింది...

సహాయం చేసే చేతులకోసం ఎదురుచూస్తూ...

ఆ నీలి మేఘం... ఎప్పుడు నల్లగా మారి...

నాలుగు చినుకులను రాలుస్తుందో...

అ చినుకులతోనైనా కడుపు నింపుకుంటాం...


నీరు లేక పైరు లేదు...

పైరు లేక గింజలు లేవు 

గింజలు లేక మనుగడే లేదు...

అయినా...

పండించే రైతుకు విలువలేదు...

ఇది నేటి ప్రపంచం... 

ఆధునిక హంగులతో...

ముందుకెళ్తూ... మరచిన అసలు నిజం..


Rate this content
Log in

Similar telugu poem from Classics