STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

హృదయానికి

హృదయానికి

1 min
14



ఈ లోకం తీరు చూడ..నేర్పవేమి నయనానికి..! 
ప్రేమరుచిని పంచడమే..తెలుసుచూడు హృదయానికి..! 

సూర్యుని ముందర దివిటీ..పెట్టే పనేమిటంటా..
చీకట్లను చీల్చమంటు..చెప్పాలా దీపానికి..! 

కృషితో కూడిన సాధన..సంకల్పం ఏవోయీ.. 
ఆకర్షణ సూత్రమేదొ..ఉంటుందా విజయానికి..!

భావసంద్ర మదిదాటగ..మనసుకసలు కష్టమేమి.. 
అలలతోటి పోరాటం..ఉండునెలా తీరానికి..! 

పొలమేదో కాలువేదొ..చూడదే నీలి మేఘం.. 
ఆత్మీయత ఎపుడైనా..దిగుతుందా వాదానికి..! 

విలువలేవొ కాపాడే..వలువలెలా ఉంటాయట.. 
వలువలనే విసిరేస్తే..దారేదోయ్ ధర్మానికి..!  


Rate this content
Log in

Similar telugu poem from Romance