హృదయ రాణి
హృదయ రాణి
ఆమెక్రీగంటచూచిందికన్నులూకలిపిందికళ్ళలోనిలిచింది
ఆమెముద్దుగాపిలిచిందిముచ్చటాలాడిందిమురిపమూచేసింది
ఆమెతీపిగాపలికిందితేనెలూచిందింది తోడుకూరమ్మంది
ఆమెఅందాలుచూపిందిఆనందమునిచ్చింది అంతరంగాన్నిదోచింది
ఆమెకలలోకివచ్చింది కవ్వించిపోయింది కోరికలులేపింది
ఆమె రాగాలుతీసింది రంజింపజేసింది రసప్రాప్తినిచ్చింది
ఆమెచిరునవ్వుచిందిందిచెంతకువచ్చింది చక్కదనాలుచూపింది
ఆమెపూలనువిసిరిందిపరిమళాలుచల్లింది ప్రేమలోదించింది
ఆమె వయ్యారలొలికింది వాలుజడనూపింది వలపులోతడిపింది
ఆమె చేయినిచాచింది చేతులుకలిపింది చేరువునేనిలిచిపోయింది
ఆమె సరసాలాడింది సంబరపరిచింది సతియైపోయింది
ఆమెనాకుప్రాణమయ్యింది జీవితమయ్యింది ప్రపంచమయ్యింది
ఆమెనుఇంకేమడుగను?ఎలావదలను?ఎట్లామరువను?
ఆమెనుగుండెలోదాచుకుంటామదిలోనిలుపుకుంటా
హృదయరాణినిచేసుకుంటా....

