STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ఎవరికి తెలుసు

ఎవరికి తెలుసు

1 min
418



పూవులా ...కాదు
నిప్పు కణికలా...
రాత్రీ పగలు మండుతోంది ..
               హృదయం
అర్థరాత్రి ఏకాంతంలో..
ఎవరు ఎవరిని పిలుస్తారు..
ఏ తరువు పూసిందో..
ఏ మనసు మురిసిందో
ఏ కన్ను మూసిందో..
ఎవరు చూస్తారు.
కాలం కడలిపై 
నే తరినై సాగుతూ...
చూడలేక ..ముసుగులున్న ముఖాల్ని
 మనలేక..ముగ్ధత్వమవనీని కాలాన     
అలసిన మదినెవరి ముందు విప్పను..
అద్దం లాంటి ఎడదెక్కడా కనబడనే లేదు
నను నే చూసుకోవటానికి..
కాలం ఊయలై ఎటు పడేస్తుఃదో..
తెలిసీ ..మనుషులకెందుకో ఈ
             తాపత్రయాలు..
నింపాదిగా నిలిచే మనిషిని చూచి
           ఎందుకు మెచ్చదో ..లోకం
ఏ జ్ఞాపకాలైనా గుర్తొచ్చే క్షణాలెన్నో..
వాటి ఆయువెంతో..
ఎవరికి తెలుసు..కాలం రంగు...రూపం.
 అది చేసే ఇంద్రజాలం..


Rate this content
Log in

Similar telugu poem from Romance