ఎదలో ఊహలు
ఎదలో ఊహలు
ఎదలో ఊహలు.....
కుదురుగ ఆమని కులుకులతో తననే ఎంచినా
ఎదలో ఊహలే ఎరుగని సౌఖ్యమే యిచ్చాయి.
మొదలే కాని మోహాలకే సుఖాలనూ తెచ్చాయి
కలువరేఖలు మెత్తదనం మత్తులో ముంచాయి.
చెలియలేఖల కొత్తదనం పొత్తునే ఊరించాయి.
ముందరే చేరిన ముసిమి అందరూ చూడగానే
తొందరే చేసి తొలి తోరణమై మెడలో పడగానే
విత్తుకునే వలపులు వింత పరుగులు చేసాయి.
హత్తుకునే హృదయం ఆ హారతినే పట్టేసాయి
ఎదలో ఊహలే ఎరుగని సౌఖ్యమే యిచ్చాయి.
మొదలే కాని మోహాలకే సుఖాలనూ తెచ్చాయి...

