STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

దుర్గా!దుర్గా!

దుర్గా!దుర్గా!

1 min
343

ఉత్పలమాల /


1. దుష్టులఁ రాక్షసాధముల దోర్చగ వచ్చిన దుర్గవై సదా

శిష్టుల బ్రోచుచుండ నిను చిత్తము నందు తలంచు వారికిన్

గష్టము లన్నియున్ దొలఁగు కామిత మెల్లను దీరిపోవుతన్

దుష్టినొసంగు భవ్య! నిను దోసిలి యొగ్గి నుతింతు మమ్మరో//


 మత్తేభవిక్రీడితము /


2. విరులన్ గొల్చిన వారికిన్ జయము సంప్రీతిన్ బ్రసాదించుచున్

గరుణన్ గాచెడి సౌమ్య!నిన్ను వినతిన్ గైమోడ్చి ప్రార్థింతు నే

సురభోగంబులఁ గోరనమ్మ గిరిజా!శుద్ధాత్మనై మెల్గి నీ

చరణాబ్జంబుల ధూళి దాల్చి నడతున్ సౌభాగ్యముల్ వర్థిలన్ //


ఉత్పలమాల /


3.శుద్ధమనంబునన్ బిలువ జూపెద వమ్మ!కటాక్షమెంతయో!

శ్రద్ధగ నీదు సేవలను సంతసమొందుచు సల్పుచుండ స

ద్బుద్ధిని కల్గ జేయగదె!

పుణ్యము పొందగ నీదు పూజలన్

బద్ధులమై నిరంతరము భక్తిగ జేయుదు మమ్మ శాంకరీ!//


శార్దూల విక్రీడితము /


4. ఓంకారేశ్వరి !పార్వతీ!జగతి నుద్దీపించి పాలించు నిన్

జంకున్ బాయగ

మ్రొక్కుచుండ సురలున్ శక్తిన్ బ్రసాదించుచున్

ఝంకారంబుల తుమ్మెదల్ కొలువ శ్రీశైలాంబికారూపిగన్

హ్రీంకారంబున వెల్గు తల్లి!నమతుల్ శ్రీరాజరాజేశ్వరీ!//


Rate this content
Log in

Similar telugu poem from Classics