STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

చూశావా

చూశావా

1 min
10


ఈ కాలమె తోటమాలి..తానైనది చూశావా..!? 
ఈ మనసే యమపాశం..రుజువైనది చూశావా..!? 

కనులముందు కలదేదో..కరిగిపోవు నిజమేలే.. 
కలలుగనే ఆ నీవే..నేనైనది చూశావా..!? 

ప్రశ్నించే వాడెవరట..జవాబిచ్చు తానెవరట.. 
ఈ నేనుకు కణకణమో..గురువైనది చూశావా..!? 

ఈ జరిగే నాటకాల..సూత్రధారి ఎటులుండును.. 
అరూపమే స్వరూపాల..పాలైనది చూశావా..!? 

అంతా అన్నీ చక్కని..నీ ప్రతిబింబాలేనోయ్.. 
భావన సాక్షిగ వెలిగే..తరులైనది చూశావా..!? 

ఘనచరిత్ర పుటలవెంట..పరుగదేమి లాభమోయ్.. 
ఇప్పుడు ఈ క్షణమదెంత..విలువైనది చూశావా..!? 



Rate this content
Log in

Similar telugu poem from Romance