STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

చిరు దీపం

చిరు దీపం

1 min
2


అవిశ్రాంత పోరాటం జరుగుతూనే ఉంది 

అనుకోని సంఘటనలు మదిని తొలుస్తుంటే

నిప్పుల శ్వాసలో మంటలు తగులుతుంటే 

తనువు పైన బూడిద కమ్ముకొని రాలుతుంది..‌


శూన్యపు మనసులో చిరు దీపం వెలగాలి

చీకటి రాజ్యంలో సూర్యోదయం కావాలి 

ఎండిన చెట్టుకు వసంతపు చిగుర్లు తొడిగితే

కృషించిన తనువులో తొలకరి జల్లులు కురుస్తాయి...


పలకరింపుల్లో మాధుర్యం కనిపిస్తే చాలు 

మౌనపు తీగలు సవరించి పలుకుతాయి

పెదవి చాటు హృదయం సంగీతం అందిస్తూ

అమ్మ పలుకుల అమృతం కురిపిస్తుంది..


ఎదురుగాలికి ఈద లేని జీవితం సాధ్యమా 

సుడిగుండాల మధ్యలో మనసు ఉంచి 

ఆకాశాన్ని ఎగిరే ఆశల అలలను అణచలేక

ఉల్లిపాయ పొట్టను తగ్గించే ప్రయత్నం చేస్తే ఎలా..


భూమిని అంతా విస్ఫోటనం చేసుకుంటూ 

మానని గాయాలకు ఔషధం అంటిస్తే లాభమా 

తియ్యటి రోగిన్ని తగిలించుకొని తిరుగుతూ

ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకుంటే కుదరదు...


అక్షరాలనిత్య పారాయణం జరుగుతుంటే 

కృంగి పోయిన మనసుకు తేజస్సు వస్తుంది

నాలుగు వాక్యాలు రాసుకుంటూ పోతే

మనసు తేలికై ముందుకు నడిపిస్తుంది..


Rate this content
Log in

Similar telugu poem from Classics