చెలి మనసు
చెలి మనసు
చిత్రమే చెలిమనసు..అందాల గగనమే..!
వర్ణించగా లేని..రాగాల నగరమే..!
ప్రేమనది తీరమున..మనిగెనా తపములో..
ఉద్యాన వనమంటి..మురిపాల శిల్పమే..!
విందుగా తనవిభుని..చూపులే గ్రోలేను..
నిజచెలిమి తీర్థాన..హాసాల భాసమే..!
హర్షాతి రేకాన..ఓ మెఱుపు వీణాయె..
చెలివలపు మధురిమల..నాదాల గంధమే..!
పిలువగా విడివడని..పెదవింటి అరుణిమే..
నునుసిగ్గు దొంతరల..దారాల కావ్యమే..!
కలహంస తుమ్మెదై..వాలెనో ఏమిటో..
పరువాల మోహమే..సరసాల కావ్యమే..!
వెన్నెల్ల హరివిల్లునటనమే కనలేని..స్వర్గాల నాట్యమే..!

