బ్రతుకు బండి
బ్రతుకు బండి
పెను ఆశల గొడవలేని పసందైన బ్రతుకు బండి..!
శ్రమశక్తికి అంకితమీ భారమైన బ్రతుకు బండి..!
భూమాతను నమ్ముకున్న రైతన్నల కేమున్నది..!?
కన్నీళ్ళు కడగండ్లే అన్నమైన బ్రతుకు బండి.!
చలి ఎండ వానలవే కప్పుకునే కంబళులే..!
ఉరితాళ్ళకు శిరసొంచే ఛిద్రమైన బ్రతుకు బండి..!
ఓదార్పుల సన్నాయితొ లాలిస్తే చాలదు'లే..!
గిట్టుబాటు ధర కోరును నష్టమైన బ్రతుకు బండి..!
ప్రభుతలెన్ని మారిననూ వీరి ఘోష తీరదాయె..!
పోరాడగ వల్లగాక మౌనమైన బ్రతుకు బండి..!
ఓ మరి చూపర కాస్త దయను ఇకనైనా..!
ఆలంబన చూప మిగులు..ప్రాణమైన బ్రతుకు బండి..!
