STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

బంగారం...

బంగారం...

1 min
303

ఇంకేమి కావాలి ఈ జన్మకు

ముత్తయిదు భాగ్యన్ని

పొందడమనే వరం తప్పా...........!!


ముదిత మెడలో పుత్తడి

 మిలమిలా మెరవడం ఓ వరమే......!!


చెవులకు లోలాకులు

 సన్నగా చేసే సవ్వడి ఓ వరమే.....!!


కాటుక కనులతో

 ఎదురుచూపు ఓ వరమే.....!!


పాపిటిలో సిందూరము 

  నిండుగా ఓ వరమే....!!


గలగలా గాజుల

 చప్పుడు ఓ వరమే....!!


కాలికి మెట్టెలు

 అందంగా ఓ వరమే.....!!


అన్నింటినిలో మెరిసి

నన్ను పెట్టకుంటే ఎలా అంటూ

గోరింట పండటం ఓ వరమే......!!


 ఘల్లు ఘల్లు మంటూ

కాలికి పట్టీలు ఓ వరమే.....!!


ఓట్టేసి చెప్పనా ఇంకొక్కసారి

వీటన్నింటి సౌభాగ్యాన్ని ఇచ్చినా

 నీవు నన్ను పొగిడితేనే వరం బంగారం......!!



Rate this content
Log in

Similar telugu poem from Romance