STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

భవిత

భవిత

1 min
5


జనంలోనే జాగృతున్నది తట్టిలేపితె మేలుకొన్నది

అహం మాటున పతనమున్నది పారదోలితె భవిత ఉన్నది


కలిసిరాదని కుంగిపోకా అలసిమనుగడ మరచిపోకా

గడ్డురోజులకోర్చుకుంటే ప్రతీరాత్రికి వేకువున్నది


కవితసుధలూ కదిలెనదులూ తెనుగుజనుల గుండెకదులూ

సినారె పాటలు తేనెమూటలు ప్రతీపదముకి అర్ధమున్నది


గతంతలచీ వెతలుపడకా హితంకోరీ మసలుకుంటే

కాలమే ఒక కొండచిలువ మంచిచెడులను మింగుతున్నది


పాతకాలం పాటలొద్దనె బామ్మ కథలనీతివొద్దనె

లోకంపోకడ కొత్తదనమును కోరుతున్నది


Rate this content
Log in

Similar telugu poem from Classics