అమ్మాయిలూ..భయపడకండి
అమ్మాయిలూ..భయపడకండి


అమ్మాయిలూ ...ప్రియాంకా రెడ్డి కి జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారా ...భయపడుతున్నారా ..
భాదపడండి ..కాని భయపడకండి ...
మీలో ఇదివరకే దాగి ఉన్న ధైర్యాన్ని ఇంకా ఇంకా మరింకా ఎలా పెంచుకోవాలో అని మాత్రమే ఆలోచించండి ...
పది మందిలో ఉన్నప్పుడు మీ ప్రతిభను చూపి అందరితో శభాష్ అనిపించుకోగలిగే మీరు ..
నలుగురిలో ఉన్నప్పుడు మీ నడవడితో ఆ సీతమ్మ తల్లినే జ్ఞాప్తికి తే గలిగే మీరు ..
ఒంటరిగా ఉన్నపుడు మాత్రం ఎందుకు భయపడాలి..
మీకు మీరు ఒంటరిగా ఉన్నానేమో అనిపించిన ఆక్షణాన ..
మీచుట్టూ ఉన్న పరిసరాల్ని ఒక్కసారి గమనించండి ..
ఏ చోటుకి వెళితే మీ ధైర్యానికి లోటు లేదని మీకు అనిపిస్తుందో అక్కడికి వెళ్లి నిలబడండి ..
ఆక్షణాన మీ మొట్ట మొదటి రక్షకులు రెండే రెండు ..
ఒకటి మీ ధైర్యం ..రెండు సమయానికి తగినట్టుగా మీరు తీసుకునే నిర్ణయం ..
వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయి తో పాటు వేలాది మంది సైన్యం ఉన్నపటికీ ..
తన రాజ్యాన్నీ , తనని తానూ కాపాడుకోవాలనే పోరాటం మాత్రం తాను ఒంటరిగానే మొదలు పెట్టింది ..
ఆ తర్వాతే అంత సైన్యం వచ్చి తనకి సహాయ పడింది ..
మీరు 100 కి , 112 కి ఇలా ఏ సైన్యానికి సమాచారం అందించినప్పటికీ ..
మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగే ధైర్యం ..
మిమ్మల్ని మీరు రక్షించుకోగల సాహసం ..
మీ చుట్టూ చేరిన రాబందులను దహించివేయగల ప్రజ్వల గుణం ..
మీలోనే ఉన్నాయన్న నమ్మకంతో మీ నడక సాగించండి ..
ఎన్ని ఘోరాలకి పాల్పడినా కఠినంగా శిక్షింపబడని క్రూరమృగాల గురించి ఆలోచన వద్దు ..
ఇలాంటి మృగాలని మూడుపూటలా తిండి పెట్టి మేపుతున్న మన రాజ్యాంగం గురించి ఆరా తియ్యొద్దు ..
సంఘటన జరిగిన దగ్గరనుండి ఒక వారం రోజులపాటూ గొంతుచించుకుని ,ఆపైన గొంతెత్తినా ఏమాత్రం ప్రయోజనం లేని మీడియా ని పట్టించుకోవద్దు ..
నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను కాపాడగలిగే ..
నీలోనే ఉన్న నీ ధైర్యాన్ని ,
పిచ్చి కుక్కల్లా వెంటాడే వారిపై విరుచుకుపడే ధృఢత్వాన్ని ,
నీకు ఉపయోగపడే ఏదో ఒక వస్తువుని నీతోనే అంటిపెట్టుకునే అలవాటును అలవర్చుకుని ,
అంతులేని ఆత్మవిశ్వాసం తో నీ రోజుని మొదలుపెట్టు ..
ఈ మృగాల మధ్యనుండి తప్పించుకునే ప్రయత్నంలో , ఇది నువ్వు దాటే మొదటి మెట్టు ..