అమ్మ ఒడి
అమ్మ ఒడి
అమ్మ ఒడి నా మొదటి బడి
నడత నేర్చిన ఒడి
అమ్మ ఒడి నా వెన్నెల కైవడి
నన్ను సంభాలించు ఒడి
అమ్మ ఒడి నాకు ఒరవడి
మమతల మడి
అమ్మ ఒడి నా కలల ఒడి
నన్ను కాచే ఒడి
అమ్మ ఒడి నా ప్రేముడి
నా మైవడి
అమ్మ ఒడి నా సంగడి
నా మెఱవడి
అమ్మ ఒడి నన్ను తీర్చిదిద్దిన నడవడి
నాకు పలుకులు నేర్పిన ఒడి
అమ్మ ఒడి నా పవళింపు ఒడి
జోలపాటల ఒడి
అమ్మ ఒడి ఒక మధుర సవ్వడి
కథలు చెప్పు ఒడి
అమ్మ ఒడి గర్భగుడి
నేర్పును తొలి నుడి
అమ్మ ఒడి పరమాత్మ ఒడి
భగవంతుని సన్నిధి
అమ్మ ఒడి ఒడికంబు ఒడి
నాకు కైముడి
----- తేజస్విని బలివాడ
