అక్షరం
అక్షరం
ఒక అక్షరం
దైవ రూపమీ
బీజామృతము
శబ్ద మయము
భావయుక్తము
శాశ్వతత్త్వము
శక్తి వంతము
సారసత్త్వము
శివాత్మకము
నిత్యనూతనం
జగతికిదే
మూలాధారము
జయప్రదము
కలము కిదే
ప్రియ నేస్తము
కవిగాయక
హృది వాసము
భారతీ సతి
మృదు భాషణం
సుర పూజ్యము
సుధామయము
సర్వ లోకపు
సమ్మోహనము
అజరామరము
కీర్తి వంతము
అక్షయమయి
సంపద రూపం
ఆలోచనకు
అద్భుతమైన
ఆకారముగ
నిల్చును తోడై
అనుక్షణము
పల్కు చుండగ
దొరుకు నీకు
ముక్తి పథము.
-----------------------
