STORYMIRROR

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

ఆత్మవిశ్వాసం...

ఆత్మవిశ్వాసం...

1 min
281

అంతులేని ప్రయాణం

అలుపులేని పయనం

విసుగురాని ప్రయాణం

అంతు చిక్కని గమనం

నిరాశలే ఓదార్పుగా

నిట్టూర్పులే ఆలంబనగా

అలసిన మనసుకు 

కలత చెందిన మనసుకు

అంతులేని ఆవేదనని తనలో

దాచుకున్న మనసుకు

మసకబారిన మనసుకు

మరణమే శరణ్యమైతే


అంతులేని ఆకాశాన్ని ఆర్తిగా అర్ధిస్తున్నా

తనతో పాటు నన్ను కూడా 

అనంత తీరాలకు తీసుకువెళ్ళమని

అంతులేని సాగర గర్భమును ఆవేదనతో

వేడుకుంటున్నా

ఎన్నో శిథిలాలను దాచుకున్న సాగరం

నన్ను కూడా తనలో కలుపుకోమని


జనన మరణాలు సామాన్యమే అయినా

మరణం అంచులను తాకడం కూడా ఓ వరం

మరణం ఉందని భయం ఎందుకు

అది నిన్ను అక్కున చేర్చుకున్న నాడు

నిను ఏ బాధలు వేధించవు

ఏ అక్కరకురాని బంధాలు నిను వేలెత్తి చూపవు


కనులు తెరిస్తే జననం

కనులు మూస్తే మరణం మధ్యలో

మనం రాసుకున్నదే మన జీవితమైతే

జీవితమే ఓ పోరాటం కాదా

అందులో ఆడి గెలవడం సాహసం కాదా

ఎంత మందికి దక్కుతుంది ఆ గెలుపు

ఓడిపోయిన వారంతా నిరాశ జీవులా

ఏదో ఒకనాడు మళ్లీ జన్మిస్తావు

దట్టమైన నల్లని చీకట్లను పారద్రోలే

ఉదయ భాను కిరణమై............ 

అనంతమైన విశ్వాన్ని ప్రకాశింప చేస్తావా

అంతులేని ఆత్మవిశ్వాసంతో...... 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational