STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

ఆత్మీయులు

ఆత్మీయులు

1 min
215

ఆపదలో బలగమంత ఆదుకుంటె బలమేలే

నేస్తమొకడు కష్టాలను పంచుకుంటె బలమేలే


 చిరుదివ్వెను వెలిగించిన చీకట్లే తొలగి పోవు

అభాగ్యులకు చిరుసాయపు

అండవుంటె బలమేలే


పంతాలూ పట్టింపులు

అహంకార మసూయలూ

బంధాలలో ఈర్ష్యలనూ వదులుకుంటె బలమేలే


చిరునవ్వుల చిలకరింపు ఆత్మీయత పలకరింపు

మమతపంచు స్నేహాలను కలుపుకుంటె బలమేలే


ఒంటరి బతుకు గమనంలో మాటలన్ని మహితమౌను

సహకరించ దైవమునే నమ్ముకుంటె బలమేలే


మధురమైన భాషణము మర్యాదలు భూషణముగ

అరమరికలు లేకుండా కలిసివుంటె బలమేలే 


మనుషులంత ఒక్కటిగా మానవీయ విలువలతో

సమరసతా భావముతో నడుచుకుంటె బలమేలే


      


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational