ఆమే లేక పోతే
ఆమే లేక పోతే
సృష్టి కి మూలం తాను
జన్మకు మూలం తాను
సంపూర్ణం లోసగం తాను
తాను లేకపోతే అసంపూర్ణమే
తాను లేకపోతే సృష్టికి అర్థంలేదు
ఇహానికి, పరానికి ఉనికే తాను
సంసారంలో సగం తాను
తాను లేకపోతే సంసారానికి అర్థమేలేదు
చిరునవ్వుల ప్రస్థానంలో పరిచయం తాను
చిరుకష్టo లోనైనా ఓదార్పునిచ్చే ఒడి తాను
అశాంతితో అల్లాడే మనసుకు
శాంతిపలుకుల చల్లదనం
కలత, నలతల్లో స్వాంతన స్పర్శ తాను
ప్రతి అడుగులో అడుగై ఊతమిచ్చి
ఊరట నిచ్చే ప్రియ నెచ్చెలితాను
ఏది సగమో, ఏది పూర్ణ మో
విడదీయరాని బంధమై నీలో మమేకమై
నీలో నీకై నిలిచిన నీ ప్రియ సఖీ తాను
జన్మతః వచ్చిన తన ఉనికిని విడిచి
నీ ఉనికినే తన ఉనికిగా మార్చుకుని
నీకై పరితపించే సౌజన్య మూర్తి తాను
నీ ధైర్యం అడుగంటి నిరాశలో నువ్వు
కూరుకొని పోయినప్పుడు నీ వెన్ను దన్ను తానౌతు
నీ పక్కన నేనున్నానంటూ నిలిచే
నీ సైన్యాధిపతి తానూ కదూ
సమాజములో సగభాగం తానౌతూ
ప్రతి పనిలో తనదైన ముద్రను వేసి
తన నేర్పరితనంతో విజయ శిఖరాలను అధిరోహించిన అమే లేకపోతె
సమాజానికి, సంసారానికి
సజీవమైన ఉనికి ఉంటుందా??
అన్నది ఊహకై నా ఊహించలేని సంగతి
