Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

broken angel Keerthi

Classics Inspirational Others

4.5  

broken angel Keerthi

Classics Inspirational Others

పాల ప్యాకెట్టు

పాల ప్యాకెట్టు

2 mins
411


2020 అందరితో 20_20 మ్యాచ్ ఆడుకుంది కదా!స్వప్న (పేరు మార్చాను)జీవితం లో కూడా ఎన్నో మార్పులు తెప్పించింది...తననీ బాధ పడేలా చేసిన తనలాంటి తల్లులకి తోడు నిలిచింది.ఎలా అంటారా అయితే మీరు చదవవలసిందే...


స్వప్న ఒక సాధారణ గృహిణి.పెద్దగా చదవలేదు కారణం పల్లెటూరు లో చదివే అమ్మాయిలు తక్కోవ.వాళ్ళ చదువు కన్న త్వరగా పెళ్లి చేసి పంపడమే ఆ ఊరి వాళ్ళకి ముఖ్యం.తన భర్త తాపీ మేస్త్రి.మంచివాడే కానీ ఆడవాళ్లంటే కాస్త చులకన.తేవడం మా బాధ్యత వండి వడ్డించడం మీ పని అనే మనస్తత్వం...


కరోనా మహమ్మారి పుణ్యమా అని నెల రోజుల నుంచి కులీ పని దొరకలేదు..ఇంట్లో వున్న డబ్బులు అన్ని అయిపోయాయి.చేసే పని చూసి అప్పు ఇచ్చే వారు లేరు.ఇంట్లో వున్న సరుకులు అన్ని అడుగంటు కున్నాయి.ఎప్పుడు ఎదో ఒక చిరు తిండి తింటూ తిరిగే పిల్లలకి వారం రోజుల నుంచి పప్పు,పెరుగు తప్ప ఎం లేదు..అన్నం బలవంతం గా తింటారు పిల్లలు మనకి తెలిసిందే..అందులోనూ రోజు పెట్టిందే పెడుతువుంటే అస్సలు తినడం లేదు.ఇంట్లో వుంటే అది కావాలి అని ఇది కావాలి అని పాప ఏడుస్తుంది అని బయట అరుగు మీద కూర్చుని పాప నీ ఆడిస్తుంది...ఎదురింటి పాప అప్పుడే అరటి పండు తింటూ రావడం చూసి... స్వప్న కూతురు మమ్మీ బనానా అంటు ఆ పాప దగ్గరికి వెళ్ళి తను తింటూ వుంటే చూస్తూ తననీ అడిగితే అమ్మ తిడుతుంది అని ఎం తెలియని వయసులో బిక్క మొహం వేసుకుని చూస్తూ ఉంటే ఆ తల్లి మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది . కనీసం పది రూపాయలు పెట్టీ అరటి పండు కూడా కొని పెట్టలేని పరిస్థితి....అన్నం తినడం లేదు ఆకలి అవుతుంది కావచ్చు అందుకే ఏడుస్తూ వుంటుంది రోజంతా అని పక్కింటి పిన్ని అనగానే.స్వప్న కూడా ఆలోచించి పాలు తాగిస్తే మంచిది అనిపించింది .ఇంట్లోకి వస్తుంది స్వప్న.అప్పటి నుంచి బయట కూర్చొని వుండటం వల్ల పిల్లి ఇంట్లోకి వచ్చి పాలు తాగేసింది...స్వప్న కు ఏడుపు ఒక్కటే తగ్గింది....ఇంట్లో ఇక పాలు లేవు పాల ప్యాకెట్లు కూడా డబ్బు లేవు.పాలు పోసే పాలమ్మ మళ్ళీ తెల్లారితే కానీ రాదు..అసలు దిక్కు తోచలేదు.కంట్లో కన్నీళ్లు సంద్రం ల మారిపోయింది....తను సరిగ్గా తినక పోవడం వల్ల పాలు సరిగ్గా రావడం లేదు.పాప పాలు తాగుతూ రానప్పుడు ఏడుస్తూ....ఏడుస్తూ పడుకుంది....తన బిడ్డ ఇంత చిన్న వయసులో ఆకలి ఎడవటం చూసి తన కన్న కడుపు తరుక్క పోయింది...బార్య అంటే నోరు మూసుకొని చెప్పింది వినాలి అనుకునే భర్త తన పిల్లల ఆకలి తీర్చలేని స్థితిలో ఉన్నాడు..తనకంటూ ఏదయినా పని వుంటే పిల్లల కోసం కాస్త డబ్బు కూడబెడుతే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు అనిపించింది.తన కంటు వచ్చిన పని వంటలు చేయడం...అందులో పిండి వంటలు,స్వీట్లు అంటే అద్బుతం గా చేస్తుంది... పిండి వంటలు చేసి పెద్ద షాపు యజమానులకి అమ్మితే అని ఆలోచన వచ్చింది.


 మెడలో ఉన్న బంగారు పుస్తల తాడు చూసి.పిల్లల ఆకలి తీర్చలేని బంగారం ఎందుకు అనిపించిందీ.పసుపు తాడు కట్టుకొని బంగారు తాడు నీ తాకట్టు పెట్టింది... ఆ డబ్బు తో ఇంట్లో నే పిండి వంటలు చేసి షాప్ వాళ్ళకి అమ్మడం మొదలు పెట్టింది...తనలాంటి మరో నలుగురికి ఉపాధి కల్పించింది....


అలాంటి స్వప్న లు మనలో కూడా వున్నారు...వాళ్లకి 

అభినందనలు..మన స్వప్నాలు స్వప్నాలు గానే వుంచకుండా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం..


మా స్వప్నక్క కథ మీకు నచ్చిందా?🙏🙂


Rate this content
Log in

Similar telugu story from Classics