STORYMIRROR

Dinakar Reddy

Comedy Thriller

3  

Dinakar Reddy

Comedy Thriller

ఏజెంట్ vs ACP ప్రద్యుమన్

ఏజెంట్ vs ACP ప్రద్యుమన్

1 min
258

ఫోన్లో ఎవరు ఏజెంట్? స్నేహ అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఫాలో మీ అంటూ కారెక్కాడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.


స్నేహ కారు స్టార్ట్ చేసింది. ఎక్కడికి వెళుతున్నాం ఏజెంట్?

ఆమె ప్రశ్నకు సమాధానంగా అతను ముందుకు వెళుతూ ఉండమన్నాడు. ఏజెంట్ ! ఫ్యాన్లు ఆపకుండా టీవీ కట్టేయకుండా మనం ఇలా తిరుగుతున్నాం కదా. మన ఆఫీసుకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది అంటారు అని అడిగింది స్నేహ.


నేనూ అదే చెబుదాం అనుకుంటున్నా. ఒకసారి నేను కాలేజ్ కి వెళ్లకుండా..


ఏమైంది ఏజెంట్. ఎందుకు ఆపేశారు. కారు ఆపు అన్నాడు ఏజెంట్. కారు దిగిన ఏజెంట్ ఇంకా స్నేహ ACP ప్రద్యుమన్ ని కలిశారు.


మా టీమ్ లో ఒకరు చనిపోయారు. అది ఆత్మ హత్యా లేక మర్డరా అని నువ్వు కనిపెట్టి చెప్పాలి అన్నాడు ACP ప్రద్యుమన్.


హ్యాండ్స్ అప్. అంటూ ఏజెంట్ అతనికి గురి పెట్టాడు. 

నువ్వు అసలు CID లో పని చేసే ACP ప్రద్యుమన్ కానే కాదు. అతని పోలికలతో వచ్చి నన్ను మోసం చేయాలనుకున్నావ్ కదూ. ఆయన నా ఫేస్బుక్ ఫ్రెండ్. అతను ఇవాళ పొద్దున్నే ఢిల్లీ వెళ్లినట్లు నేను లొకేషన్ చెక్ చేశాను. అంటూ అతణ్ణి కారులోకి ఎక్కించారు. అతను తప్పించుకోకుండా స్నేహ అతని చేతులు కట్టేసింది.


స్నేహ కారు స్టార్ట్ చేసి వాళ్ళ ఆఫీసు వైపు పోనిచ్చింది.

చెప్పు. 

చెప్పు అబ్బయా. నెల్లూరులో ఏం పని మీదొచ్చావ్. చేపల పులుసు తింటావా అని ఏజెంట్ ఆ అజ్ఞాత వ్యక్తి భుజం మీద కొడుతూ అడిగాడు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Comedy