Vinaykumar Patakala

Drama Tragedy Inspirational

4  

Vinaykumar Patakala

Drama Tragedy Inspirational

విధి కలిపినా ప్రేమ బంధం

విధి కలిపినా ప్రేమ బంధం

10 mins
41


నవంబర్ 19, శనివారం మార్నింగ్,ఎనిమిది గంటల ముప్పై ఏడు నిముషాలు.


ఓరేయ్ వినయ్ ఇంకెంతసేపని వెయిట్ చేయిస్తావ్ రా మమ్మల్ని, అమ్మాయి కోసం ఎదురు చుస్తే ఒక ఆనందం ఉంటుంది నీకోసం ఎదురు చుస్తే ఎం వస్తుంది రా మాకు టైం వేస్ట్ కాకపొతే అని చిరాకుగా అన్నాడు రవి.


ఇంకెంత సేపు రా రెడీ అవ్వడానికి మనం వెళ్ళేది సినిమా కి రా బాబు తొందరగా కానివ్వు... అవతల లేట్ అవుతుంది.... అని అన్నాడు పవన్.


హా వచ్చేస్తున్నాను...వచ్చేస్తున్నాను.... ఒక్క రెండు నిమిషాలు మామ ప్లీజ్..అని సమాధానం ఇచ్చాడు వినయ్.


రేయ్ నీ రెండు నిమిషాల సల్లగుండ ఇప్పటికే రెండు నిమిషాలు రెండు నిమిషాలు అని గంట నుండి అదే అంటున్నావ్ ఇంకెంత సేపు రా... బాబు. నువ్వు ఇట్లా లేట్ చేస్తున్నావు కాబట్టే నీకు ఇప్పటి వరకు ఒక్క గర్ల్ఫ్రెండ్ కూడా లేదు.... అని చిరాకుగా అన్నాడు రవీ.


రేయ్ పిచ్చోడా లవ్ అనేది ఒక అద్భుతమైన ఫీల్ దాన్ని ఎవ్వరి మీద పడితే వారి మీద చూపించకూడదు అది ఒక్కరి మీదే కలుగుతుంది ఒక్కసారి మాత్రమే కలుగుతుంది దాన్నే నిజమైన ప్రేమ అంటారు.... అని గదిలో నుండే సమాధానం ఇచ్చాడు వినయ్.


సరేలే సార్ ఎదో బుద్ది గడ్డి తిని ఆ మాట అన్నాను రా అయ్యా ఇక అపార బాబు నీ వేదాంత నీతులు...అని నీరసంగా అన్నాడు రవి.


సరే పద ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది పైగా మరి అక్కడ మనకోసం థియేటర్ లో వెయిట్ చేస్తున్నారు అని బయటకు వచ్చి అన్నాడు వినయ్.


నీతో ప్లాన్ చేసుకున్న ప్రతిసారి లేట్ గానే అవుతుంది రా మాకు.... అని తలకొట్టుకుంటూ అన్నాడు పవన్.


సరేలేరా.... ఇక ఆపండి చివరికి వాడు వచ్చేసాడుగా ఇంకెందుకు లేట్ చేయడం పద వెళ్దాం అని అంటూ అందరు కలిసి సినిమాకి వెళ్ళారు.


సినిమా అయిపోయింది...


రవీ, వినయ్, మహేష్ ఇంకా పవన్ వాళ్ళందరూ సినిమా చూసి అటునుండి అటు ఒక మంచి రెస్టారంట్ కి వెళ్లి డిన్నర్ చేసి రూం కి వెళ్దాం అని ప్లాన్ వేసుకున్నారు.


మామ నాకు మటన్ బిర్యానీ కావాలి రా తిని చాలా రోజులైంది అని తన చేతులని తన కడుపు మీద చేయి వేసి గుండ్రంగా రుద్దుతూ అన్నాడు పవన్.


అయితే నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ వెజ్ మంచూరియన్ కావాలి... అని రవీ అన్నాడు.


అయితే నాకు మాత్రం మంది కావాలి మచ్చా .... అని అన్నాడు మహేష్.


అయితే నాకు చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్ కావాలి మామ అని అన్నాడు వినయ్.


ఛీ నీ అబ్బా ఏ జంతువుని వదలరా మీరు ఇంకేం జంతువు ఉందని రా వదలటానికి ఛీ ఛీ .. వెజ్ తినండి రా హెల్త్ బాగుటుంది అంటే ఎప్పుడూ, చూసిన నాన్-వెజ్..... నాన్-వెజ్ అని ఏడుస్తారు.... అసలు ఏం ఉంది రా అందులో..అని అడిగాడు రవీ.


అందుకే కదరా నికు ఊరికే చెప్పేది ఒక్కసారి టేస్ట్ చూసి. చెప్పు అని.... కానీ నువ్వు వింటేగా మా మాటలు అని అన్నాడు వినయ్.


సరే సరే తరవాత చూద్దాం లే కానీ ముందైతే ఆర్డర్ ఇచ్చింది తిందాం.... అని అన్నాడు రవి.


రేయ్ మామ నువ్వెప్పుడైనా బ్లైండ్ డేట్ గురించి విన్నావా..!అని అడిగాడు వినయ్.


వాట్.... బ్లైండ్ డేట్ ఆ ఏం ఉంటుందేంటి అందులో.... అని కొంటెగా అడిగాడు పవన్.


ఆ నీ మొఖం ఉంటది నీకెందుకు రా దాని గురించి నీకు అల్రెడీ ఓ గర్ల్ ఫ్రండ్ ఉందిగా అది సరిపోదా నీకు అని అక్కసుగా అన్నాడు రవీ.


రేయ్ వాడేదో తెలుసుకుందాం అని అడిగితే మీరెంట్రా ఇలా మీనింగ్ లేకుండా మాట్లాడుతున్నారు కాస్త వాడి డౌట్ ఎంటో చూడండి అని అన్నాడు పవన్.


మరేం లేదురా బ్లైండ్ డేట్ అంటే ఒకరి మొఖాలు ఒకరు చూసుకోకుండా కేవలం చాటింగ్ చేస్తూనే లవ్ చేసుకోవడానికి బ్లైండ్ డేట్ అని అంటారు.... ఒకవేళ మంచి అమ్మాయి దొరికితే ఫేట్ సెట్ అయిపోతుంది అంతే లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది అంతే ... ఐనా దీని గురించి నీకెందుకు రా హా ఐనా నీకు గర్ల్ ఫ్రెండే లేదు మరి నీకెందుకు రా దీని గురించి హా అని అడిగాడు రవి.


ఎదో తెలుసుకుందాం అని అడిగాను రా అంతే మీరు దాన్ని పట్టుకొని వేరే అర్ధం ఏం తీసే ప్లాన్ పెట్టుకోకండి అని కరాఖండిగా చెప్పాడు వినయ్.


ఐనా నీకు అమ్మాయి పడితే కదరా అశ్చర్యం పడకపోతే ఏం ఉంది అని వినయ్ మీద జోక్ వేస్తూ నవ్వుతూ అన్నాడు రవీ.


రేయ్ నేను నీకు,.... నాకు అమ్మాయిలు ఇష్టం లేదని చెప్పనా లేదుగా, నాకు లవ్ మీద నమ్మకం ఉంది ఆలాగే రెస్పెక్ట్ కుడా ఉంది నేను జస్ట్ సరైన అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను.... నాకు లవ్ కావాలి కానీ ఒక అమ్మాయి కావాలి అది కుడా లైఫ్ లాంగ్ తోడుగా ఉండే అమ్మాయి కావాలి అంతే కానీ ఇలా టైం పాస్ కోసం ఎంజాయ్ చేసే వాళ్ళలా కాదు నేను. అని సీరియస్ గా అన్నాడు వినయ్.


అబ్బో నీతులు బాగానే చెప్తున్నావ్ అయితే ఒక పని చేయి రా నిజంగా నీకు లవ్ మీద నమ్మకం ఉంటే ఒక అమ్మాయితో పరిచయం చేసుకొని తనతోనే ప్రొపోజ్ చేయించుకొని మాకు చూపించు అప్పుడు ఒప్పుకుంటాను ఈ ప్రపంచంలో ఇంకా నిజమైన ప్రేమ ఉంది అని లేకపోతే నువ్వు ఓడిపోయావ్ అని ఒప్పుకొని మీ ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయినే నువ్వు పెళ్ళి చేసుకోవాలి ఏం అంటావ్ దీనికి....

ఒకే నా, అని వినయ్ తో ఛాలెంజ్ చేసాడు రవి.


రేయ్ మూసుకొని కామ్ గా కూర్చొని తినురా ముందు ఎక్కడ పడితే అక్కడ దేని మీద పడితే దాని మీద బెట్ వేసి ఛాలెంజ్ చేసుకుంటున్నారు సిగ్గుండాలి రా ఆలా చేయడానికి....ఐనా మీ మెంటల్ కోసం అభం శుభం తెలియని ఒక అమ్మాయి మీద బెట్ కట్టడం ఏంట్రా హా దాని మొగతనం అని అనిపించుకోదు అని అన్నాడు పవన్.


లేదురా వాడు నిజమే అన్నాడు నేను ఇలాగే సైలెంట్ గా ఉంటే రేపు ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు అంటాడు వాటాన్నింటిని ఆపేయాలి అంటే ముందు వీడి చెత్త నోటిని మూయాలి అప్పుడే వాడు ఇంకెప్పుడు ఎవరి మీద చెత్త చెత్త కామెంట్స్ వేయకుండా ఉంటాడు అని అంటూ, సరే రా రవి నువ్వు చేప్పినట్లు నేను ఈ ఛాలెంజ్ బెట్ ని తీసుకుంటున్నాను..... నేను ఒక బ్లైండ్ డేట్ చేసి మంచి అమ్మాయిని వెతికి తనని తన నోటితోనే ప్రొపోజ్ చేయించుకొని అసలైన ప్రేమ ఇంకా బ్రతికే ఉంది అని నిరూపిస్తాను నీ నోటికి తాళం కూడా వేస్తాను అని సీరియస్ గా అంటూ ఛాలెంజ్ ఆక్సిప్ట్ చేసాడు వినయ్.


అయితే ఒకే రా, నువ్వు ఒక బ్లైండ్ డేట్ చేయరా ఒక అమ్మాయితో అది కూడా ఆన్లైన్ లో దాంతో తెలుస్తుంది నువ్వు చెప్పింది నిజమేనా కాదో అని.... ఆవేశంగా అన్నాడు రవీ.


సో నేను ఇప్పుడు ఆన్లైన్ లో బ్లైండ్ డేట్ చేయాలి అది నేను నిజమైతే అప్పుడు నేను చెప్పింది నమ్ముతావు లేకపోతే నేను ఓడిపొయినట్లు అంతే గా.... అని అన్నాడు వినయ్


అవును కరెక్టుగా చెప్పావు నువ్వు గెలిస్తే నువ్వు చేప్పినట్లుగానే నా నోటికి తాళం వేస్తాను నా మాటల పద్దతిని మార్చుకొని మాట్లాడుతాను...అని అన్నాడు రవి.


సరే రేపే స్టార్ట్ చేస్తాను ఆన్లైన్ బ్లైండ్ డేట్ ని, ఐనా ఇది లవ్ రా పిచ్చోడా దాన్ని విధి నిర్ణయిస్తుంది మనం కాదు, అంతే కాని మనం ఇలా ఆన్లైన్ లో ఎవరిని పడితే వారిని లవ్ చేస్తే దాన్ని లవ్ అనరు మోజు అంటారు. అయినా నాకు తొందరేం లేదు నిదానంగానే రానివ్వు తనని నేను వెయిట్ చేస్తాను. అని అంటూ వాళ్ళ డిన్నర్ని ముగించుకొని వెంటనే వాళ్ళ రూమ్ కి తిరిగి వెళ్ళిపోయారు వినయ్ ఇంకా తన ఫ్రెండ్స్.


వినయ్ తన రూమ్ లోకి వెళ్ళి ఆరోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ... ఆలోచిస్తూనే అలాగే గాఢ నిద్రలోకి జారుకున్నాడు.


మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి రెడీ అయ్యి టిఫన్ చేస్తున్నాడు వినయ్ అంతలోనే తన మొబైల్ కి ఒక నోటిఫికేషన్ వచ్చిన సౌండ్ వచ్చింది... అది ఏంటా అని చుస్తే.... తన చిన్ననాటి ఫ్రెండ్ తనకు ఫేస్బుక్ లో మెసేజ్ చేసింది దానికి రిప్లై ఇస్తుండగా హటాత్తుగా తనకి ఒక కామెంట్ నోటిఫికేషన్ వచ్చింది అదేంటి అని చూస్తే గత వారం తను పోస్ట్ చేసిన ఒక పోస్ట్ కి చాలా మంది అభినందనలతో పాటు సపోర్ట్ చేస్తూ ఆ ఆర్టికల్ ని ఎంతో సపోర్ట్ చేస్తూ ప్రశంసలతో ముంచేసారు, కానీ అవి ఏవి అతని మనసుకి తాకలేదు.... కానీ అనుకోకుండా అప్పుడే వచ్చిన ఒక వ్యక్తి కామెంట్ మాత్రం తన మనసుకి పులకింత తో పటు ఎంతో ఆసక్తి తెలిపింది అది ఎవ్వరిది అని చూస్తే అది ఒక అమ్మాయి ది అని తెలిసింది తన గురించి తెలుసుకోవాలని తన పోస్ట్ చూస్తే తన ప్రొఫైల్ లో నాకంటే అద్భుతంగా రాసిన ఒక పోస్ట్ ని చూసి ఆశ్చర్యం వేసింది.... వినయ్ కి .


ఇదేంటి ఈ పోస్ట్ నేను రాసిన దానికంటే చాలా చాలా బాగుంది ఎవరబ్బా ఇంత అద్భుతమైన ఆర్టికల్ రాసి పోస్ట్ ని క్రియేట్ చేసింది అని ఆ పోస్ట్ క్రియేట్ చేసిన వ్యక్తి ఏవరా అని కనుక్కుందాం అని ఆ వ్యక్తి కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడానికి చూసాడు కానీ అల్రెడీ తను వినయ్ కి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్లు అతనికి మరింత అశ్చర్యానికి గురి చేసింది.... అప్పుడు వినయ్ ఆ రిక్వెస్ట్ నీ ఎక్స్సెప్ట్ చేసి తనకి మెసేజ్ చేయడానికి చూసాడు కానీ అప్పుడే తనకి ఆ వ్యక్తి నుండి ఒక మెసేజ్ రావడం చూసి వినయ్ కి ఇంకా ఆశ్చర్యం వేసింది....


ఎవరబ్బా తను నాకంటే ఇంత బాగా రాసింది,... అలాంటిది నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంతో పాటు మెసేజ్ కకూడా చేసింది.... అని తన గురించి ఇంకా తెలుసుకోవాలని మరింత ఆసక్తి కలిగింది వినయ్ కి..... వెంటనే తను పంపిన మెసేజ్ కి రిప్లై ఇచ్చి తనతో చాట్ స్టార్ట్ చేసాడు వినయ్.


ఆలా మొదలైన వారి చాటింగ్ కొద్ది సమయంలోనే ఎంతో దగ్గరయ్యారు.


వాళ్ళ చాటింగ్ చూస్తుంటే వాళ్లిద్దరికీ ఇంతకుముందు నుండే పరిచయం ఉన్నట్లు వాళ్లిద్దరికీ చాలా సార్లు అనిపించింది కానీ ఆ విషయం బయటకు చెప్తే ఎక్కడ తప్పుగా అనుకుంటారేమో అని ఆ విషయాన్ని వాళ్ళ మనసుల్లోనే దాచి నార్మల్ గా మాట్లాడుతూ ఉన్నారు.


ఆలా మొదలైన వారి స్నేహం ప్రయాణం చేస్తూ చేస్తూ మూడు సంవత్సరాలు గడిచాయి.... ఈ మూడు సంవత్సరాల సమయంలో వాళ్లిద్దరు ఎంతో దగ్గరికి వచ్చారు ఎంతగా అంటే వారికే తెలియకుండా ఒకరికొకరు ప్రేమించుకునే అంతగా కలిసిపోయారు.


ఆలా ఒకరినొకరు తెలియకుండానే వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు కానీ వాళ్లు ఎప్పుడూ తమ మనసులో ఉన్నా ప్రేమ తాలూకు ఉన్నా ఫీలింగ్స్ ని ఒకరికొకరు చెప్పుకోలేదు దానికి కారణం ఆలా చెప్తే వాళ్లు ఎక్కడ తమ మధ్య ఉన్నా స్నేహాన్ని కోల్పోతారు అనే భయంతో చెప్పలేదు పైగా ఆలా చేయడంతో స్నేహానికి ద్రోహం చేసినట్లు ఉంటుంది అని వారి ఉదేశ్యం అందుకే వాళ్లేప్పుడు వల్ల మనసులో ఉన్నా ఫీలింగ్స్ నీ చెప్పుకోలేదు ఆలా జరుగుతున్న సమయంలో ఒకరోజు భవాని తనకి మెసేజ్ చేసింది...గడిచిన గత ముడు సంవత్సరాల ప్రయాణంలో భవాని ఇంకా వినయ్ చాలా సార్లు మాట్లాడుకున్నారు కానీ ఎప్పుడు ఒక్కసారైనా ఒకరినొకరు చూసుకోలేదు.... నిజానికి వాళ్లు ఎలా ఉంటారో కుడా తెలియదు ఆలా ప్రేమ కలిగిన ఈ జోడిని మీలో ఎంత మందిని చూసారో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళే మొదటి జంట అని నేను చెబుతాను.


ఒకరినొకరు చూసుకోకుండా సాగుతున్న వాళ్ళ ప్రేమ ప్రయాణంలో ఒకరోజు భవాని వినయ్ కి మెసేజ్ చేసింది.


హాయ్ వినయ్ ఎలా ఉన్నారు అని మెసేజ్ చేసి అడిగింది భవాని.


హా నేను బాగున్నాను ఇంతకీ మీరెలా ఉన్నారు అని సమాధానం ఇస్తూ అడిగాడు వినయ్.


హా నేను కుడా బాగున్నాను ఈరోజు సండే కదా సో అందుకే ఎం చేయాలో తోచట్లేదు అందుకే నీకు మెసేజ్ చేశాను.... ఇంతకీ నువ్వేం చేస్తున్నావ్ అని సమాధానం ఇస్తూ అడిగింది భవాని.


ఒహ్హ్ అవునా నిజం చెప్పాలంటే నాకు కూడా చాలా బోర్ గా ఉంది అందుకే ఎం చేయాలో తోచట్లేదు అలా అలా బుక్స్ చూస్తుండగా ఒక వంటల బుక్ కనిపిస్తే ఈరోజు మధ్యాహ్నం లంచ్ కి అదే చేద్దామని అనుకొని దానికి సంబందించిన రెసీపి చదువుతున్నాను అని చెప్పాడు వినయ్.


ఓహ్ అవునా ఇంతకీ ఏం వండుతున్నావ్.... ఏంటి స్పెషల్ ఈరోజు లంచ్ లో అని ఆసక్తి చూపిస్తూ అడిగింది భవాని.


ఎం లేదు ఎదో వెజ్ టైప్ అంత మిక్సడ్ ఫ్రై కర్రీ అంట దానికి సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంట ఇందులో రాసుంది అని చెప్పాడు వినయ్.


ఓహ్ అవునా అని అంతు ఆలా మాట్లాడుతునే ఉన్నారు వినయ్ ఇంకా భవాని... అలా మాట్లాడుతూనే వినయ్ తన వంట పూర్తి చేసుకొని.... స్టవ్ ఆఫ్ చేసి హాల్లోకి వచ్చి సోఫాలో కాస్త ప్రశాంతంగా కూర్చొని భవానితో మాట్లాడాడు.


సమయం గడిచేకొద్దీ వినయ్ ఇంకా భవానిలా మధ్య ఉన్నా బంధం గతంలో కంటే మరింత బలంగా మారుతుంది. వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని తెలియకుండానే వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. 


ఆలా మాట్లాడుకుంటూ ఉండగా.... సరే ఈ న్యూ ఇయర్ కి నీ ప్లానింగ్ ఏంటి అని అడిగింది భవాని.


ఎం లేదు ఇంటికి వెళదామని అనుకుంటున్న మరి నీ ప్లాన్ ఏంటి అని అడిగిండు వినయ్.


హో అవునా నాకు ఓసారి హైదరాబాద్ ని చూపించచ్చుగా అని మాటల్లో అడిగింది భవాని.


తప్పకుండా చూపిస్తాను కానీ దానికోసం నువ్వు హైదరాబాద్ కి రావాలి కదా అని అన్నాడు వినయ్.


అయితే సరే మరి నేను హైదరాబాద్ కి వస్తాను ఈ న్యూ ఇయర్ కి ఈవెనింగ్ కలుద్దాం... ఆలాగే నీకొక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి అని చెప్పింది భవాని.


అవునా ఏంటి ఆ విషయం అని అడిగాడు వినయ్.


ఇప్పుడు కాదు హైదరాబాద్ కి వస్తాను గా అప్పుడు చెప్తాను నీకు అని చెబుతూ సరే ఇప్పటికే చాలా ఆలస్యం అయింది వెళ్ళి భోజనం చేయండి లేట్ చేస్తే ఆరోగ్యం పాడవుతుంది అని చేప్పి సరే నేను ఈవెనింగ్ మాట్లాడుతాను అని చేప్పి కాల్ కట్ చేసింది భవాని.


వినయ్ కుడా సరే అని చెప్పి కాల్ కట్ చేసి, లంచ్ చేసేసి తన ప్లేట్స్ ని కడిగేసుకొని తన జాబ్ గురించి లాప్టాప్ ముందు కూర్చొని సెర్చ్ చేస్తూ ఉన్నాడు వినయ్.


అలా కొన్నిరోజుల తరువాత వినయ్ హైదరాబాద్ కి బయలుదేరాడు....


వినయ్ హైదరాబాద్ కి వెళ్ళగానే తన ఇంటికి చేరుకున్న తరువాత భవాని కి మెసేజ్ చేసి చేరుకున్న అని మెసేజ్ చేసాడు..... దానికి రిప్లై ఇంకా రాలేదు.... బాహుషా తను పనిలో ఉందేమో అని భావించి తరువాత చేస్తుంది లే అని ఉహించి ఫోన్ ని పక్కన పెట్టి తన కుటుంబంతో కాసేపు సమయాన్ని గడపడానికి హాల్లోకి వెళ్ళాడు వినయ్.


తన ఫ్యామిలీ తో కాస్త సమయాన్ని గడిపాక డిన్నర్ చేసి తన గదిలోకి తిరిగి వెళ్ళిపోయాడు వినయ్.... తన గదిలోకి వెళ్ళగానే తన ఫోన్ ఆన్ చేసి చూసాడు వినయ్ అప్పుడు కొన్ని మెసేజెస్ వచ్చాయి .... వాటిని చుసిన ఆ నెక్స్ట్ సెకండ్ షాక్లో ఉండిపోయాడు వినయ్ ఎందుకంటే ఆ మెసేజెస్ వచ్చింది భవాని నుండి అది కుడా ఒకటి రెండు లేదా పది కాదు ఏకంగా డెబ్భై మూడు మెసేజెస్ రావడంతో ఒక్కసారిగా షోక్ ఐ ఆలోచనలో పడ్డాడు వినయ్..


అంతలో భవాని నుండి హలో వినయ్ ఏం అయిపోయియవు ఉన్నావా అసలు ఉంటే రిప్లై ఇవ్వు అని మరో మెసేజ్ రావడంతో...వెంటనే షోక్ లో నుండి తేరుకొని బయటకి వచ్చి..


హా సోరి... సోరి అమ్మతో కాస్త మాట్లాడటానికి వెళ్ళాను అందుకే లేట్ అయింది సోరి పైగా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడంతో రూంలోనే ఛార్జింగ్ పెట్టి కిందకి వెళ్ళిపోయాను తిరిగి వచ్చి చుస్తే నువ్వు పంపిన మెసేజెస్ ఉన్నాయి.... ఐ ఆమ్ రియల్లీ సో సోరి అని సోరి చెబుతూ జరిగింది చెప్పాడు వినయ్.


అయ్యో ఇందులో సోరి చెప్పడానికి ఏం ఉంది నువ్వు మీ ఫ్యామిలీ తో కాస్త టైం గడుపుదాం అని వెళ్ళావ్ అంతేగా ఇందులో నీ తప్పు ఉంది అని నేననుకోవట్లేదు సరే ఇక ఈ టాపిక్ ని వదిలేద్దాం .. అని అంటూ నేను ఈ ఫ్రైడే హైదరాబాద్ కి వస్తున్నాను అది చెప్పడానికి మీకు ఇన్ని మెసేజెస్ చేశాను అని అంది భవాని..


ఒహ్హ్ అవునా వావ్ నిజంగా వస్తున్నావా హైదరాబాద్ కి అని ఎంతో ఆత్రుతతో అడిగాడు వినయ్.


హా నిజంగా నేను ఈ శుక్రవారం మార్నింగ్ ట్రైన్ కి వస్తున్నాను సో మనం నైట్ నెక్లెస్ రోడ్ దగ్గర కలుద్దాం ఆఫ్టర్ 11 తరువాత అని అంది భవాని.


హా తప్పకుండా నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని సమాధానం ఇచ్చాడు వినయ్.


సరే మరి ఉంటాను అని చేప్పి కాల్ కట్ చేసింది భవాని.


హా సరే అని చేపి వినయ్ కుడా కాల్ కట్ చేసాడు.


ఫ్రైడే డిసెంబర్ 31...


చివరికి వినయ్ ఇంకా భవాని వాళ్ళ మెదటి మీటింగ్ కి అనుకున్న రోజు రానేవచ్చింది... ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూసారు.


సంవత్సరాలు కాస్త నెలలుగా, నెలలు కాస్త వారాలుగా, వారాలు కాస్త రోజులలాగా, రోజులు కాస్త గంటలుగా మారాయి,


సాయంత్రం ఎనిమిది ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది.... వినయ్ భవానిని కలిసేందుకు ఎంతో ఆత్రుతంగా ఉన్నాడు.... ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని తను మంచి ఐరన్ చేసిన సూట్ వేసుకొని 99 రోసెస్ బొకే తీసుకోని దానితో పాటు ఒక అందమైన డైమండ్ రింగ్ తీసుకోని నెక్లెస్ రోడ్ కి బయలుదేరాడు వినయ్.


వినయ్ కి భవానిని చూడాలని ఆత్రుతతో వాళ్లు అనుకున్న టైం కంటే మూడు గంటల ముందుగానే వచ్చి భవాని కోసం ఎదురు చూస్తున్నాడు వినయ్.


కానీ వినయ్ కి తెలియని విషయం ఏంటంటే భవాని కుడా వినయ్ నీ ఎపుడెపుడు చూడాలని ఆత్రుతతో భవాని కుడా మూడు గంటల ముందుగానే వచ్చి వినయ్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్నా ఒక చిన్న ఓపెన్ కాఫీ షాపులో చెట్టు కింద ఉన్నా టేబుల్ దగ్గర కూర్చొని వినయ్ కోసం ఎదురు చూస్తూ ఉంది భవాని.


కానీ వినయ్ ఇంకా భవాని ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు కాబట్టి భవానికి వినయ్ ఎలా ఉంటాడో తెలియదు అదే విదంగా వినయ్ కి కుడా భవాని ఎలా ఉంటుందో తెలియదు.... అందుకు వినయ్ ఆ ప్లేస్ చుట్టూ మూడు నాలుగు సార్లు తిరుగుతూ ఉన్నాడు వినయ్ అలా తిరుగుతూ తిరుగుతూ, భవాని కూర్చున్న టేబుల్ అపోజిట్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళాడు కాని వినయ్ భవానిని గుర్తుపట్టలేదు, ఎందుకంటే భవాని ఎలా ఉంటుందో వినయ్ కి తెలియదు అలాగే వినయ్ కి కూడా భవాని ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే వాళ్ళు కలుసుకోవడం ఇదే మొదటి సారి పైగా వాళ్ళ ఫేస్బుక్ లో తమ తమ పిక్స్ ఏవి ఒకరికి ఒకరు చూయించుకోకపోవడంతో వాళ్లిద్దరూ ఒకరినొకరు గమనించలేకపోయారు...


  


వారిద్దరూ ఒకరినొకరు కలుస్తారా?

వాళ్లు తమ ప్రేమ ఫీలింగ్స్ నీ ఒకరిపై ఒకరు వ్యక్తం చేస్తారా?


తదుపరి ఎపిసోడ్ గురించి తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి..... విధి కలిపినా ప్రేమ బంధం




              కొనసాగుతుంది




Rate this content
Log in

Similar telugu story from Drama