Vinaykumar Patakala

Drama

4  

Vinaykumar Patakala

Drama

విధి కలిపినా ప్రేమ బంధం ( 5 )

విధి కలిపినా ప్రేమ బంధం ( 5 )

5 mins
36


అలా వెళ్తున్న వాళ్ళని శాంభవి చూసి... ఆగండ్రా.... ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళేది అని అడిగింది శాంభవి.


అమ్మ అర్జెంట్ పని ఉందమ్మా నా ఈ పాత మొబైల్ ని రిపేర్ చేయించాలి ఇందులో నాకు చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది అది ఈ కొత్త మొబైల్ లోకి రావడం లేదు అని పూర్తి గా విషయం చెప్పాడు వినయ్.


ఐనా సరే నువ్వు వెళ్ళడానికి విల్లేదు ఇప్పుడిపుడే కోలుకుంటున్నావ్ మళ్ళీ నువ్వు బయటకి వెళ్తే ఏం అవుతుందో ఎవరికి తెలియదు అని కోపంగా చూస్తూ అంది శాంభవి.


అది కాదమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ నాకు అర్ధం చేసుకో ప్లీజ్....! అమ్మ అని ఎంతో బ్రతిమిలాడుతూ ఎంతగానో రిక్వెస్ట్ చేసాడు ఇక తప్పట్లేదు అని చివరికి ఒప్పుకుంది కానీ గంట తరువాత ఇంట్లో ఉండాలి లేకపోతే ఇంకెప్పుడు బయటకు పంపను అని కండిషన్ పెట్టింది శాంభవి.


సరే అమ్మ..... అని చెప్పి గబా గబా టిఫిన్ చేసి అజయ్ చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్ళారు వినయ్ ఇంకా తన ఫ్రెండ్స్.


అజయ్ కి తెలిసిన వ్యక్తి ఆ మొబైల్ ని క్షుణ్ణంగా పరిశీలించి బాగా చెక్ చేసాక కాస్త టైం ఇవ్వండి చూసి చెప్తాను అని చెప్పి,... లోపల ఉన్న తన వర్క్ షాప్ లోకి వెళ్ళి ఆ మొబైల్ ని మరింత డీటెయిల్ గా చూసాడు ఆ వ్యక్తి... సరిగ్గా ఐదు నిముషాల తరువాత బయటకు వచ్చి.... మొబైల్ అయితే ఎలాగోలా పని చేసేలా చేస్తాను కానీ అందులో ఉన్నా డేటా కి మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పాడు ఆ వ్యక్తి.


ఆ మాటలు విన్న వినయ్ ఒక నిమిషం ఆలోచనలో పడ్డాడు.... సరే ముందైతే రిపేర్ చేయండి ఆతరువాత ఏం జరుగుతుందో ఆ భగవంతుడే చేయాలి... అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు వినయ్... సరే అని అతను వెంటనే ఆ మొబైల్ ని రిపేర్ చేయడం స్టార్ట్ చేసాడు....


సరిగ్గా ముపై నిముషాలు తరువాత ఆ వ్యక్తి బయటకు వచ్చి వినయ్ మొబైల్ ని వినయ్ కి అప్పగించి సారీ అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టింది కానీ,... జాగ్రత్త ఇంకా పూర్తిగా గమ్ అంటుకోలేదు అందుకే దాని చుట్టు ఈ స్టిక్కర్స్ పెట్టాను అని చెప్పాడు ఆ వ్యక్తి.


వినయ్ వెంటనే ఆ మొబైల్ నని తీసుకొని చాలా థాంక్స్ అన్న అని చెప్పి డబ్బులు ఇచ్చి తన కొత్త మొబైల్లో ఉన్నా సిమ్ తీసి తన పాత మొబైల్లో వేసి మొబైల్ ని ఆన్ చేసి చూసాడు......


ఆన్ చేసాక ముందుగా తన ఫేస్బుక్ ని ఓపెన్ చేసాడు...ఓపెన్ చేసిన ఐదు నిముషాలు పాటు అది లోడింగ్... లోడింగ్ అని వచ్చి లాస్ట్ కి


లాగ్ఇన్ నోటిఫికేషన్ ని చూపించింది.... ఆ నోటిఫికేషన్ ని క్లిక్ చేసి... లాగ్ ఇన్ ఐడి ఇంకా లాగ్ ఇన్ పాస్వర్డ్ కొట్టాడు.... ఐడి ఇంకా పాస్వర్డ్ కొట్టినా మళ్ళీ లోడింగ్... లోడింగ్.. అని చూపిస్తూ......మళ్ళీ ప్లీజ్ లాగ్ ఇన్ అని నోటిఫికేషన్ ఎర్రర్ వచ్చింది.


దాంతో ఏం చేయాలో అర్ధం కాక అయోమయంలో పడిపోయాడు వినయ్.


మరి ఇప్పుడు ఎలా రా ఆ అమ్మాయి ని ఎలా కనుకుంటావ్ అని అడిగాడు రఘు.


తెలియదు రా నాకు తనకి ఉన్నా కాంటాక్ట్ సోర్స్ ఇదొకటే ఇప్పుడు ఇది కుడా లేదు ఇప్పుడేం చేయాలో అర్ధం కావట్లేదు అని బాధతో కూడిన గొంతుతో అన్నాడు వినయ్ ...


ఒక నిమిషం అగు నా మొబైల్ తో లాగ్ ఇన్ అయ్యి చూస్తాను అని చెప్పి వినయ్ ఫేస్బుక్ అకౌంట్ ని ఓపెన్ చేసాడు అజయ్.


అది వినగానే వినయ్ ఒక్కసారిగా మళ్ళీ చిన్న హోప్ పెట్టుకొని లేచి అజయ్ మొబైల్ వైపుకి చూసాడు.


అజయ్ తన అకౌంట్ తో వినయ్ అకౌంట్లోకి వెళ్ళి భవాని డీటెయిల్స్ చూసాడు కానీ..... భవాని అకౌంట్ ప్రైవేట్ అకౌంట్ అవ్వడంతో వాళ్లంతట వాళ్లు రిక్వెస్ట్ చేస్తే తప్ప వేరేవాళ్లు మెసేజ్ చేయలేరు అని తెలుసుకున్న వినయ్ ఇంకా అజయ్ వాళ్లు ఇక చేసేదేం లేక ఇంటికి నిరాశగా తిరిగి వెళ్ళిపోయియారు.


అప్పుడు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిముషాలు.


నిరాశగా వచ్చి సోఫాలో కూర్చున్న వినయ్ ని చూసిన శాంభవి...


ఏం అయ్యింది కన్నా ఎందుకు అంత దిగులుగా ఉన్నావ్.... ఏదైనా ప్రోబ్లేమా అని అడిగింది శాంభవి.


ఏం లేదమ్మా నీ దగ్గర ఇంకా నాన్న దగ్గర ఒక విషయం దాచాను అని చెబుతూ... అమ్మ నేను భవాని అనే ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ ఇప్పుడు తను ఎక్కడ ఉందో ఎలా ఉందో అసలు తెలియటం లేదు అని నిరాశగా బాధపడుతూ చెప్పాడు వినయ్.


వినయ్ మాటలు విన్న శాంభవి కి ఒక్కసారిగా తనకి ఆక్సిడెంట్ జరిగిన రోజు గుర్తొచ్చింది.... హాస్పిటల్ లో నర్స్ తనకు వినయ్ పర్స్ తో పాటు ఒక డైమండ్ రింగ్ ఇవ్వడం గుర్తొచ్చింది ఆ రింగ్ ని చూసినప్పుడు తనకి అప్పుడు అర్ధం కాలేదు కానీ ఇప్పుడు వినయ్ చెప్పిన విషయం విన్నాక తనకి క్లారిటీగా అర్ధం అయింది, ఆ రోజు ఆ డైమండ్ రింగ్ ఈ అమ్మాయి కోసమే అన్నమాట అని తెలుసుకొని... మరేం అయ్యింది కన్నా....ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందా అని అడిగింది శాంభవి.


అదేం లేదమ్మా నిజానికి జరిగిందేంటంటే మేమిద్దరం ఒకరి మొహాలు ఒకరం చూసుకోకుండా ప్రేమించుకున్నాం....తను నా ఫోటో అడగలేదు ఆలాగే నేను కూడా తనది అడగలేదు ఆలాగే మొబైల్ నెంబర్ కుడా షేర్ చేసుకోలేదు.... తనతో ఎప్పుడు మాట్లాడిన ఫేస్బుక్ లోనే మాట్లాడాను.


తనని ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి వెళ్తున్న రోజునే తనని ప్రపోజ్ కుడా చేయాలని ఒక డైమండ్ రింగ్ కుడా తీసుకున్నాను. కానీ తనని కలిసే టైం కి ఒక చిన్న పాపని కాపాడబోయి ఇలా ఆక్సిడెంట్ అయ్యింది నాకు ఇప్పుడు తను నన్ను ఒక మోసగాడిలా చూస్తుందేమో అమ్మ... అని తన మనసులోని బాధనంతా పంచుకున్నాడు వినయ్.


ఛ... ఛ...ఆలా ఎందుకు అనుకుంటావ్ రా నువ్వు...... నువ్వు మోసగాడివి అయితే


ఆ అమ్మాయి నిన్ను కలవడానికి ఎందుకు వస్తా అని అంటుంది చెప్పు.. బాహుషా తనకి నీ కాంటాక్ట్ నెంబర్ లేకపోవడంతో సైలెంట్ గా ఉంది అనుకుంట... అని సపోర్ట్ చేస్తూ అంది శాంభవి.


ఏమో అమ్మ మళ్ళీ నేను తనని చూస్తానో లేదో తెలియట్లేదు అని ఎంతో నిరాశగా అన్నాడు వినయ్.


రేయ్ వినయ్ ప్రయత్నం చేసి ఓటమిని అంగీకరించడంలో ఒక కారణం ఉంది కానీ.... అసలు ప్రయత్నమే చేయకుండా ఇలా ఓటమిని ఒప్పుకుంటే ఎలా దొరుకుతుంది ఆ అమ్మాయి నీకు అని ధైర్యం చెప్పింది శాంభవి.


మరేం చేయాలి అమ్మ నువ్వే చెప్పు అని సలహా అడిగాడు వినయ్.


ఒక పని చేయి నీ ఫేస్బుక్ ఓపెన్ కావట్లేదు అని అంటున్నావ్ కానీ ఆ అమ్మాయి తో నువ్వు మాట్లాడినప్పుడు ఏ....ఏ డీటెయిల్స్ షేర్ చేసుకున్నారో ఒక్కసారి గుర్తు చేసుకో ఆ నెక్స్ట్ తనని ఎలా కలవాలో ఎక్కడ వెతకాలో నీకు ఒక ఐడియా వస్తుంది అని సలహా ఇచ్చింది శాంభవి.


అది విన్న వెంటనే వినయ్ మెదడులో టింగుమని ఒక ఐడియా వచ్చింది దాంతో వెంటనే ఆ పక్కనే ఉన్నా ఒక నోట్ పాడ్ లో భవాని కి సంబందించిన అని వివరాలు రాసుకొని...ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాడు వినయ్.


వినయ్ కి తెలిసినంతవరకు భవాని కార్మినగర్ లో ఉంటుంది అక్కడే ఒక కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది అని మాత్రమే తెలుసు ఇంకా అప్పుడపుడు తనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తినడానికి కొన్ని హోటల్స్ కి వెళ్ళేది అని తెలుసు అంతకుమించి ఏమి తెలియదు అని చెప్పాడు వినయ్.


ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో వినయ్ నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ అమ్మాయి తనంతట తానే వెతుక్కుంటూ వస్తుంది ఒక వేళ నీకు రాసి పెట్టలేదు అంటే నువ్వెంత నిజాయితీగా కష్టపడిన తను నీకు దక్కదు.... కాబట్టి నమ్మకంతో ముందుకి అడుగు వేస్టు వెతుకు తను నికు డాకుతుంది అని చెపింది శాంభవి.


సరే అమ్మ అని చేపి వినయ్ తన గదిలోకి వెళ్ళాడు.


ఆలా వెళ్ళిన ఐదు నిముషాలకి వినయ్ వాళ్ళ తండ్రి అశోక్ ఫోన్ ఎవరితోనో ఎంతో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఇంట్లోకి వచ్చి హాల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు.


ఆ కాల్ పూర్తయ్యాక తన కోట్ తీసి పక్కన పెడుతుండగా అంతలో శాంభవి వచ్చి గ్లాస్ వాటర్ ఇచ్చి కోట్ తీసుకుంది...


అశోక్ వాటర్ తాగేసి ఆ గ్లాస్ టేబుల్ మీద పెట్టి కాస్త రిలేక్స్డ్ గా కూర్చున్నాడు.... అది గమనించిన శాంభవి... ఏంటండీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఏంటి విషయం అని అడిగింది షాంభవి.


నికు ఎప్పుడు చెబుతుంటాను గా నాకు బిజినెస్ లో ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసాడు అతని సహాయం తోనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని, అని ఎంతో సంతోషంగా చెప్పాడు అశోక్.


హా అవును వాళ్ళ కుటుంబం కరీంనగర్ లో ఉంటుంది అని చెప్పారు వాళ్ళది కుడా పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అని చెప్పారుగా అని అడిగింది....


హా అవును.... విషయమేంటంటే వాళ్ళమ్మాయికి సంబంధాలు చుస్తున్నారు అంట, సో.... మన వినయ్ ని అడిగారు వాళ్ళ అమ్మాయికి...


అవునా,... మరి మీరేం చెప్పారు... అని కంగారు పడుతూ అడిగింది శాంభవి.


ఏం చెప్తాను.... ఇంకా ఏం చెప్పలేదు కాస్త టైం కావాలి అని అడిగాను ఇది వాడి లైఫ్ గురించి సో, జాగ్రత్తగా ఉండాలిగా.... ఇప్పుడిప్పుడే ఆపరేషన్ నుండి కోలుకుంటున్నాడు మళ్ళి అంతలో పెళ్ళి అంటే కంగారు పడతాడు అందుకే కాస్త టైం అడిగాను...


మరి మీరేం అనుకుంటున్నారు అని కొంచెం డౌట్గా అడిగింది శాంభవి. 


నేనైతే ఒపుకుందాం అని అనుకుంటున్నాను.... ఇన్నాళ్ళుగా ఫ్రెండ్స్ గా ఉన్న, మేము వాళ్ళ పెళ్లితో ఇద్దరం బంధువులం అయిపోతాం,...అని సంతోషంగా నవ్వుతూ చెప్పాడు అశోక్.


అది విన్న శాంభవి కి ఏం మాట్లాడాలో.... ఎలా వినయ్ విషయం చెప్పాలో అసలు అర్ధం కావట్లేదు....


              కొనసాగుతుంది




Rate this content
Log in

Similar telugu story from Drama