Vinaykumar Patakala

Drama

4  

Vinaykumar Patakala

Drama

విధి కలిపినా ప్రేమ బంధం ( 4 )

విధి కలిపినా ప్రేమ బంధం ( 4 )

6 mins
23



ఇంటికి వచ్చాక క్రమ క్రమంగా నెమ్మదిగా కోలుకుంటున్న వినయ్ సరిగ్గా రెండు వారాల తరువాత అర్ధరాత్రి రెండున్నర కి, అప్పటిదాకా ఎంతో ప్రశాంతంగా ఘాడనిద్రలో ఉన్నా వినయ్ కి సడెన్గా తనకి ఒక విషయం గుర్తొచ్చింది దాంతో ఒక్కసారిగా ఎదో పెద్ద పిడుగు పడినట్లు ఉలిక్కిపడి నిద్ర లేచాడు వినయ్.


నిద్ర లేచిన వెంటనే.... ఓహ్ గాడ్ షిట్ మాన్.... ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించాను రా బాబు అని తల పట్టుకొని తనను తాను తిట్టుకుంటూ... నెక్స్ట్ సెకండ్ బెడ్ మీద నుండి లేచి వెంటనే తన మొబైల్ గురించి వెతకడం మొదలు పెట్టాడు...


ఇల్లంతా వెతికిన తన మొబైల్ ఎక్కడ దొరకలేదు... అమ్మ ని అడుగుదాం తనకి బాహుషా తెలుసుంటుందేమో అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న ఉండే గది దగ్గరికి వెళ్ళాడు, తలుపు తట్టి అమ్మ అని పిలవబోయాడు కానీ అంతలో తనకి ఈ టైంలో మంచి నిద్రలో ఉంటారుకదా ఇప్పుడు వాళ్లని నిద్ర లేపి ఇబ్బంది పెట్టడం ఎందుకు రేపు ఉదయ్యన్నే లేచాక అడుగుతాం అని అనుకొని తిరిగి తన గదికి వెళ్ళిపోయాడు వినయ్.


తన గదిలోకి వెళ్ళాక వినయ్ తన బెడ్ మీద పడుకొని కళ్లు మూసుకున్నాడు కానీ ఎంత ప్రయత్నించినా తన ఆలోచన మొత్తం భవాని మీద ఉండడం తో తనకి నిద్ర రావడం లేదు రాత్రి అంతా భవాని ఆలోచనలతో జాగారం చేసి ఉదయం అవ్వగానే ముందుగా అమ్మ ని వెతుక్కుంటూ శాంభవి దగ్గరికి వెళ్ళాడు వినయ్.


శాంభవి ని ఇల్లంతా తిరిగి వెతుకుతూ... వెతుకుతూ చివరిగా గార్డెన్ లో ఉన్న తులసి చెట్టు దగ్గరికి వచ్చి చూసాడు వినయ్.


సరిగ్గా అదే టైం కి శాంభవి స్నానం చేసుకొని రెడీ అయ్యి తులసి కోట చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ పూజ చేస్తుంది.... అది చుసిన వినయ్ నేరుగా శాంభవి దగ్గరికి వెళ్ళి.


అమ్మ నా ఫోన్ ఎక్కడ రాత్రి నుండి కనపడట్లేదు అని అడిగాడు వినయ్.


శాంభవి అప్పటికే పూజ ముగించుకొని హారతి శ్లోక మంత్రం జపిస్తూ హారతి ఇస్తుంది.... హారతి ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ హారతి పళ్లాని వినయ్ వైపుకి తిప్పి తన చేతితో హారతి ఇచ్చి.... భగవంతుడా ఈ ఇంటికి ఎలాంటి దిష్టి తగలకుండా చల్లగా చూడు తల్లీ అని దండం పెట్టి మొక్కుకొని....


హా ఇప్పుడు చెప్పు ఎంటో అడుగుతున్నావ్... ఎంటి అది అని పూజ సామాన్లు సర్దుతూ అడిగింది శాంభవి.


అదే అమ్మ నా ఫోన్ ఎక్కడ.... రాత్రి నుండి కనిపించట్లేదు నువ్వెక్కడైనా చూసావా అని అడిగాడు వినయ్.


శాంభవి మౌనంగా ఇంట్లో ఉన్నా పూజ గదిలోకి వెళ్ళి హారతి ప్లేట్ ఇంకా పూజ బాస్కెట్ ని పూజ గదిలో పెట్టి అక్కడే ఉన్నా ఒక బాక్స్ తీసుకొచ్చి ఇదిగో ఇది నీదే అని చేపి వినయ్ చేతికి ఇచ్చి వంట గదిలోకి వెళ్ళింది శాంభవి.


ఏంటమ్మా ఇది... నాకెందుకు ఇచ్చావ్ అని అయోమయంగా అడిగాడు వినయ్.


నువ్వు నన్ను ఎం అడిగావ్...


నా ఫోన్ ఎక్కడ అని అడిగాను....


నీ చేతిలో ఉంది అదే నిన్న మీ నాన్న నీకోసం తెచ్చాడు అది అని కిచెన్ లో నుండి సమాధానం ఇచ్చింది శాంభవి.


ఆ మాటలు వినగానే వెంటనే వినయ్ ఆ బాక్స్ తెరిచి చూసాడు... ఆ బాక్స్ లో ఉన్నది చూడగానే ఒక్కసారిగా షోక్ అయ్యి అమ్మ ఏంటమ్మా ఇది అని అడిగాడు వినయ్....


నీ మొబైలే అది...


కానీ అమ్మ నా మొబైల్ వన్ ప్లస్ బ్రాండ్ అమ్మ ఇది ఐ ఫోన్ నాది కాదు ఇది అని చెప్పాడు వినయ్.


తెలుసు కానీ నువ్వు కొన్న వన్ ప్లస్ మొబైల్ కి నీకు జరిగిన ఆక్సిడెంట్ లో చాలా డామేజ్ అయింది మొతం స్క్రీన్ తో పాటు ఫోన్ మొత్తం పగిలిపోయింది అందుకే మీ నాన్న నీకోసం స్పెషల్ అమెరికా నుండి తెప్పించారు అని చెప్పింది షాంబావి.


షాంబావి మాటలు విన్న వినయ్ ఒక్కసారిగా.... ఓరి దేవుడా ఎంత పని చేశావయ్యా అని తన తల పట్టుకొని మోకాళ్ళ మీద కుప్పకూలిపోయాడు వినయ్.


అంతలో అశోక్ తన గదిలో నుండి బయటకు వచ్చి... మొకాళ్ల మీద కూర్చొని బాధపడుతున్న వినయ్ ని చూసి.... ఏం అయింది రా వినయ్ ఆలా ఉన్నావ్ ఒంట్లో బాలేదా ఎంటి అని అడిగాడు అశోక్.


లేదు నాన్న నా మొబైల్ పోయింది అని బాధ పడుతూ చెప్పాడు వినయ్.


నీ మొఖం పోయింది నీ చేతిలో ఉన్నది ఎంటి మరి అని అడిగాడు అశోక్.


అయ్యో నాన్న ఇది నా మొబైల్ కాదు నాన్న... నా మొబైల్ బ్రాండ్ వన్ ప్లస్ కానీ ఐ ఫోన్ నాన్న అని చెప్పాడు వినయ్.


అది విన్న అశోక్ కి వెంటనే ఒక విషయం గుర్తొచ్చి...ఒహ్హ్ హా చెప్పడం మర్చిపోయాను రా... నీకు ఆక్సిడెంట్ అయినప్పుడు నీ మొబైల్ ఫోన్ పగిలి పోయింది రిపేర్ చేయించి తీసుకురమ్మని పిఎ కి చెప్తే... ఎంత ఖర్చు చేసిన ఇది మళ్ళీ రిపేర్ అవ్వడం కుదరని పని అని చెప్పాడు అంత షోరూం వాళ్లు... దాని లోపల ఉన్నా పార్ట్స్ మొతం పూర్తిగా డామేజ్ అయ్యాయి అంట అందుకే ఆలా కుదరదు అని నీకోసం లేటెస్ట్ న్యూ లాంచ్ మొబైల్ తీసుకున్నాను అది నీకు సర్ప్రైజ్ గా ఇవ్వాలని అనుకున్నాను అని చెప్పాడు అశోక్.


అయ్యో నాన్న ఎంత పని చేసారు నాతో ఒక్క మాట చెప్పిన బాగుండేది కదా నాన్న అని ఏడుపుగొట్టు మొఖం పెట్టుకొని బాధపడుతూ అన్నాడు వినయ్.


ఇప్పుడు ఏం అయ్యింది రా అంత బాధ పడుతున్నావ్ ఈ మొబైల్ నచ్చలేదా ఎంటి నికు అని అడిగాడు అశోక్.


నచ్చడం నచ్చకపోవడం కాదు నాన్న.... అందులో ఉన్నా డేటా గురించి నేను బాధపడేది..... ఇప్పుడు మళ్ళీ ఆ మొబైల్ లో ఉన్నా డేటా ని ఎలా తిరిగి పొందాలి అని బాధపడుతూ అడిగాడు వినయ్.


దాందేముంది గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అకౌంట్ ఉందిగా దానితో ఓపెన్ అవ్వు మళ్ళీ నీ డేటా మొత్తం నీకు తిరిగి వస్తుంది... ఒక వేళ అప్స్ ఏమైనా ఉంటే సిం కార్డ్ ఎలాగో మారుస్తావ్ కదా అప్పుడు మళ్ళీ న్యూ గా డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చెయ్యి అప్పుడు నీ ఓల్డ్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి గా అప్పుడు ఇంకేంటి మరి ప్రాబ్లెమ్ అని సలహా ఇస్తూ చెప్పాడు అశోక్.


నిజమే నాన్నో మీరు చెప్పింది మొబైల్ పాడైంది కానీ అందులో ఉన్నా డేటా కాదుగా అని ఒక్కసారిగా ఎక్కడ లేని సంతోషంతో ఆ కొత్త మొబైల్ ని తీసుకొని తన నాన్న ని హాగ్ చేసుకొని థాంక్స్ చెప్పి పరిగెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు వినయ్.


వినయ్ హడావిడి చుసిన అశోక్ అసలు ఏం అయ్యింది వీడికి అని అయోమయంగా వినయ్ వైపు నిరీక్షణగా చూస్తూ మనసులో అనుకుంటూ హాల్లో కూర్చొని పేపర్ చదవడం మొదలు పెట్టాడు అశోక్.


వినయ్ తన పాత ఫోన్ ఎక్కడ ఉందొ కనుక్కొని దానిలో ఉన్న సిం కార్డ్ ని తీసి తన కొత్త మొబైల్లో వేసి ఆన్ చేసాడు... మొబైల్ ఆన్ అయ్యాక ముందుగా తన అకౌంట్ ని ఓపెన్ చేసి డేటా రికవరీ ఆప్షన్ ని క్లిక్ చేసి తన పాత మొబైల్ లో ఉన్న డేటా ని మొత్తం తన కొత్త మొబైల్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి చూసాడు అలా చేస్తూ చేస్తూ సాడెన్గా ఎర్రర్ అని వచ్చింది, మళ్ళీ ప్రయత్నించాడు వినయ్, అలా నాలుగు ఐదు సార్లు ప్రయత్నిస్తూనే ఉన్నాడు వినయ్, కానీ తను ఎంత ప్రయత్నించినా ముందు బాగానే నడిచి ఆ తరువాత హటాత్తుగా ఎర్రర్ అని రావడంతో కాస్త కంగారు పడ్డాడు దాంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్న వేళలో సాడెన్గా తనకి తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు...


ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళకి కాల్ చేసి పూర్తి విషయం చెప్పాడు అది విన్న వాళ్ళు ముందుగా షాక్ అయినా ఆ తరువాత చాలా సంతోషించారు ఎందుకంటే వాళ్ల గ్రూప్ లో మొట్టమొదటగా నిజాయితీగా ఇలా మొహం కుడా చూడకుండా లవ్ చేసిన వాళ్లు ఎవరైనా ఉన్నారు అంటే అది వినయ్ ఇంకా భవాని మాత్రమే.


వినయ్ వాళ్ళకి పూర్తి విషయం చెప్పి ఇంటికి వచ్చి కలవమన్నాడు దానికి సరే పదిహేను నిమిషాలలో అక్కడ ఉంటాం అని చెప్పి కాల్ కట్ చేసారు... కాల్ కట్ చేసిన వెంటనే వినయ్ బాత్రూం లోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ ఐ రెడీ అయ్యాడు.


సరిగ్గా పదిహేను నిముషాలు కాగానే వినయ్ ఫ్రెండ్స్ అజయ్ ఇంకా రఘు వినయ్ ఇంటికి చేరుకున్నారు.


హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అని నవ్వుతూ పలకరించారు అజయ్ ఇంకా రఘు.


హా మేం బాగానే ఉన్నాం రా ఇంతకీ మీరెలా ఉన్నారు మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడిగారు శాంభవి, ఇంకా అశోక్.


హా వాళ్లు కుడా బాగానే ఉన్నారు.... అని నవ్వుతూ సమాధానం ఇచ్చి... ఆ ఆంటీ వినయ్ ఉన్నాడా అని అడిగాడు అజయ్.


హా తన గదిలో ఉన్నాడు అనుకుంట వెళ్ళండి వెళ్ళి చూడండి అని చెప్పింది శాంభవి.


హా అలాగే అని చెప్పి నేరుగా వినయ్ గదిలోకి వెళ్ళారు అజయ్ ఇంకా రఘు.


లోపలికి వెళ్ళగానే వినయ్ తన సిస్టం ముందు కూర్చొని యు ట్యూబ్ లో మొబైల్ రిపేర్ కి సంబందించిన వీడియోస్ చూస్తూ వాళ్ళకి కనిపించాడు ఇంకా తన ఎదురు వినయ్ పాత మొబైల్ ఏ భాగానికి ఆ భాగం విడదీసి ఉంది...


అది చూసి....రేయ్ మామ ఏంట్రా ఇది... నీ మొబైల్ ని ఇలా చేశావ్ ఏంటి కొంపదీసి నీకు చేసినట్లు దానికి కూడా ఆపరేషన్ చేస్తున్నావా ఏంటి అని తమాషాగా అడిగాడు రఘు.


ఆలా ఏం లేదురా నా మొబైల్ పాడైంది అసలు ఆన్ అవ్వట్లేదు అందుకే ప్రాబ్లెమ్ ఏం ఉందా అని మొత్తం విప్పి చూస్తున్నా కానీ నాకేం తెలియట్లేదు అని నిరాశగా చెప్పాడు వినయ్.


అవునా అని ఆ మొబైల్ వైపుకి తీవ్రంగా చూస్తూ.... అరే దీన్ని చూస్తుంటే చాలా ఎత్తునుండి కింద పడినట్లు ఉంది అందుకే ఇది పని చేయటం లేదు అని చెప్పాడు అజయ్.


మరేలా నాకు అర్జెంటుగా... ఎట్టి పరిస్థితిలో ఈ మొబైల్ ఆన్ అవ్వాలి అప్పుడే నేను తనతో మాట్లాడగలుగుతాను అని చెప్పాడు వినయ్.


వినయ్ మాటల్లో ఉన్నా బాధని అర్ధం చేసుకొని నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి చెప్తే బాహుషా అతను మనకి హెల్ప్ చేయచ్చేమో అని అన్నాడు అజయ్.


ఆ మాటలు విన్న వినయ్... వెంటనే..... లేడి జింక పిల్లల చెంగు చెంగు మని ఒక్కసారిగా ఎగిరి లేచి నిజంగానా... నా ఫోన్ ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తాడా అతను అని ఎంతో ఆత్రుతగా అడిగాడు వినయ్.


హా చేస్తాడు రా నాకు నమ్మకం ఉంది అని చెప్పాడు అజయ్.


అయితే పద ఇంకెందుకు ఆలస్యం చేయడం వెంటనే అతని దగ్గరికి వెళ్దాం అని చేపి అతని దగ్గరికి బయలుదేరారు...



             కొనసాగుతుంది




Rate this content
Log in

Similar telugu story from Drama