Vinaykumar Patakala

Drama

4  

Vinaykumar Patakala

Drama

విధి కలిపినా ప్రేమ బంధం ( 3 )

విధి కలిపినా ప్రేమ బంధం ( 3 )

11 mins
23


వినయ్ కి ఆపరేషన్ చేసి బ్రతికించాలి అంటే ఒ పాజిటివ్ బ్లడ్ కావాలి దానికోసం వినయ్ తండ్రి అశోక్ కుమార్ తనకి తెలిసిన వాళ్ళందరికి కాల్ చేసి సహాయం అడిగాడు అందుకు ప్రతిఫలంగా వాళ్లు ఎంత డబ్బు కోరిన ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు కానీ ఎవరికి కాల్ చేసినా...వాళ్ళందరి నుండి లేదు అనే మాట తప్ప ఉంది అని సమాధానం రాలేదు ఆ వార్త విన అశోక్ కుమార్... ఎంటి తండ్రి ఇదిగో ఒక్కగానొక్క కొడుకు వాడు సంతోషంగా ఉండాలని ఇంత సంపాదించాను అలాంటిది ఇంత డబ్బు ఉండి ఇంత పలుకుబడి ఉండి కుడా నా బిడ్డని నేను కాపాడుకోలేకపోతున్నాను.... దయచేసి నా బిడ్డని కాపాడు తండ్రి అని గుండె పగిలిన ఆవేదనతో అర్థించుకుంటూ ఆ భగవంతుడి ముందు మోకాళ్ళ మీద నించోని తన రెండు చేతులు జోడించి తన కొడుకుకి ప్రాణ బిక్ష పెట్టమని వేడుకుంటున్నాడు అశోక్ కుమార్.

అంతలో అక్కడికి వచ్చిన భవాని వినయ్ పరిస్థితి కనుక్కొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి.... డాక్టర్ ఇందాక మీరు ఆపరేషన్ చేస్తున్న వ్యక్తి కి ఒ పాజిటివ్ బ్లడ్ కావాలి అని అన్నారుగా నాది ఆ గ్రూప్ బ్లడే నేనిస్తాను తీసుకోండి వెంటనే అతనికి ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పింది భవాని.


అది విన్న డాక్టర్....వావ్ నిజంగా మీది ఒ పాజిటివ్ బ్లడా అయితే ఇంకేం ఆ అబ్బాయికి ఎం కాదు అని సంతోషంగా చెబుతూ వెంటనే నర్స్ ని పిలిచి... చూడండి నర్స్ ఈ మేడం ది ఒ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఈ మేడం మనకు బ్లడ్ ఇస్తుంది వెంటనే ఆ బ్లడ్ తీసుకోని ఆపరేషన్ థియేటర్ కి వచ్చేయండి మేం అక్కడ బ్లడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి భవానీ ని నర్స్ తో పంపించి డాక్టర్ వెంటనే ఆపరేషన్ థియేటర్ కి పరుగులు తీస్తూ వెళ్ళాడు.


డాక్టర్ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళగానే అశోక్ కంగారు పడుతూ తనకి సంబందించిన వాళ్ళకి ఫోనే చేసి మాట్లాడుతూ ఉన్నాడు... అంతలో డాక్టర్ అక్కడికి వొచ్చి.... బయపడకండి మీ అబ్బాయికి ఎం కాదు ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాం మీ అబ్బాయికి బ్లడ్ దొరికింది అని చెబుతూ వెంటనే ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాడు డాక్టర్.


డాక్టర్ మాటలు విన్న అశోక్ కుమార్ ఇంకా తన భార్య శాంభవి.... ఇద్దరికీ ఒక్కసారి మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది కానీ ఆ ఆనందం ఎక్కడ అడియాసలు అవుతాయి అనే భయంతో వాళ్ళకి కలిగిన ఆనందాన్ని బయట పెట్టకుండా లోలోపలే ఆనంద పడుతూ.... హే భగవంతుడా నా కొడుకుకి ఎం కాకుండా చూడు తండ్రి వాడిని క్షేమంగా మాకు అప్పగించు తండ్రి అని వేడుకుంటూ ఆపరేషన్ బాగా జరగాలి అని ఆ పరమేశ్వరుడునీ ప్రార్థిస్తూ చూడండి డాక్టర్ మేం బయట హాస్పిటల్ ఎదురుగా ఉన్నా విగ్నేశ్వరుడి గుడికి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శనం చేసుకొని వస్తాం మేము వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోండి...... మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను మేం కోరేది ఒకేఒకటి దయచేసి మా బిడ్డని మాకు తిరిగి క్షేమంగా సంపూర్ణ ఆరోగ్యాంగా అప్పగించండి డాక్టర్ అని చేతులు జోడించి వేడుకున్నాడు అశోక్ కుమార్.


అయ్యో మేము డాక్టర్స్ మి సార్ మేము ప్రాణాలు కాపాడటానికే ఇక్కడ ఉన్నాం అంతేకాని వాటితో వ్యాపారం చేయడానికి కాదు అంటూ, మీరేం దిగులు పడకండి మీరు దైర్యంగా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రండి నేను వెళ్ళి మీ అబ్బాయి ఆపరేషన్ సంగతి చూస్తాను అని దైర్యం ఇచ్చి వాళ్ళని గుడికి పంపించి డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాడు.


ఆపరేషన్ స్టార్ట్ ఐనా సరిగ్గా ఐదు నిముషాలు తరువాత ఒక నర్స్ హడావిడిగా బ్లడ్ తీసుకోని పరిగెట్టుకుంటూ వస్తుంది అంతలో అక్కడికి ఒక చిన్న పిల్లడు బాల్ తో ఆడుకుంటుండగా సాడెన్గా ఆ బాల్ తన కాలితో గట్టిగ తన్నడంతో ఆ బాల్ వేగంగా ఎగురుతు వినయ్ కోసం బ్లడ్ తీసుకొస్తున్న నర్స్ కంటికి తగిలింది దాంతో ఆ నర్స్ ఒక్కసారిగా అమ్మ అని అరుస్తూ తన రెండు చేతుల్లో ఉన్నా బ్లడ్ బాటిల్ ని ఒక్కసారిగా వదిలేసి తన కంటికి అడ్డుగా చేతుల్ని పెట్టుకుంది ఆ నర్స్... ఆ వెంటనే ఆ బ్లడ్ బాటిల్ కింద పడి పగిలిపోయింది ఆ బాటిల్ లో ఉన్నా బ్లడ్ మొతం నేలపాలు అయిపోయింది....


ఆ బాటిల్ కింద పడడంతో ఒక పెద్ద శబ్దం చేసింది దాంతో ఆపరేషన్ థియేటర్ లో ఉన్నా డాక్టర్స్ కి ఆ శబ్దం కారణంగా వాళ్ళకి ఇబ్బంది కలగడంతో బయట ఎం జరుగుతుందో అని చూడమని వెంటనే బయటకి వచ్చి చూసాడు ఒక జూనియర్ డాక్టర్.


నర్స్ ఎం అయింది ఎంటి ఆ శబ్దం అని సీరియస్ గా అడిగాడు డాక్టర్.


డాక్టర్ మాటలకి ఉలిక్కిపడి డాక్టర్ వైపుకి కంగారుగా చూస్తూ సార్ అది ఆ పిల్లడు అని తడబడుతూ ఏదో చెప్పాలని చూసింది ఆ నర్స్ అంతలో వినయ్ వల్ల తల్లిదండ్రులు ఆ ప్లేస్ కి వచ్చి ఎం అయింది డాక్టర్ ఎం జరిగింది మా అబ్బాయి కి ఆపరేషన్ చేయాల్సిన వాళ్లు మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు అశోక్ కుమార్.


అంతలో డాక్టర్ నేల మీద పగిలిపోయిన బ్లడ్ బాటిల్ ని చూసి.... సీరియస్ గా... ఎంటి నర్స్ ఇది ఎవరు పగలగొట్టారు ఈ బాటిల్ నీ అని కోపంగా చూస్తూ అడిగాడు డాక్టర్.


అది డాక్టర్ నేను బ్లడ్ బాటిల్ ని తీసుకోని ఆపరేషన్ థియేటర్ కే బయలుదేరాను కానీ వస్తుండగా దారిలో ఆ పిల్లడు బాల్ తో ఆడుకుంటూ సాడెన్గా ఆ బాల్ ని నా వైపుకి తన్నడం తో ఆ బాల్ వేగంగా వచ్చి నా కంటికి తగిలింది దాంతో నా చేతిలో ఉన్నా బాటిల్ చేయి జారి కింద పడి పగిలిపోయింది డాక్టర్ అని చేప్పి క్షమాపణలు కోరింది ఆ నర్స్.


నర్స్ మాటలు విన్న డాక్టర్ కోపంగా ఆ పిల్లాడిని చూసి... ఓరేయ్ ఇటు రారా నీకు అసలు బుద్దుందర హాస్పిటల్ లో ఎవరైనా బాల్ తో ఆడతారా నీ కారణంగా అక్కడ ఒక ప్రాణం పెద్ద ప్రమాదంలో పడింది అతన్ని ఇప్పుడు ఎవరు కాపాడతారు నువ్వు కాపాడతావా హా అని కోపంగా చూస్తూ తిట్టాడు డాక్టర్...


ఆ పిల్లాడి తల్లిదండ్రులు డాక్టర్ కి క్షమాపణలు చెబుతూ రిక్వెస్ట్ చేసారు.... అంతలో అక్కడికి తన చేతిని చిన్న దూది ముక్కతో రుద్దుకుంటూ వొచ్చింది భవాని.


డాక్టర్ ఆపరేషన్ చేయడం ఆపేసి ఇక్కడ వీళ్ళతో పనికిరాని గొడవలకి దిగాడు ఎంటి అని అయోమయంగా అక్కడికి వచ్చి....


ఏం అయింది డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లో ఉండాల్సింది ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది భవాని.


ఈ ఇడియట్ రాస్కేల్ మీరు ఇచ్చిన బ్లడ్ నీ బాల్ తో కొట్టి కింద పడేసాడు మేడం ఇప్పుడు ఆ అబ్బాయికి బ్లడ్ ఎక్కడ నుండి తేవాలి అని టెన్షన్ పడుతూ కోపంగా చూస్తూ చెప్పాడు ఆ డాక్టర్.


అది విన్న భవాని ఒక్క సెకండ్ షాక్ లో పడింది... నెక్స్ట్ సెకండ్ షాక్ నుండి బయటకి వచ్చిన భవాని అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళతో పనికిమాలిన ఆర్గుమెంట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తారేంటి నన్ను అడగచ్చు గా మళ్ళీ అని అన్నది భవాని.


మేడం ఆస్ పర్ రూల్ ఒక వ్యక్తి కేవలం ఒక లిమిట్ వరకే బ్లడ్ ఇవ్వాలి మేడం అంతకుమించి ఇస్తే ఆ వ్యక్తి తన శక్తి ని కోల్పోతాడు మేడం అని చెప్పాడు డాక్టర్.


అది విన్న ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఇస్తా అంటుంది కదా, ఆ అమ్మాయికి లేని భాద మధ్యలో నీకేంటయ్యా అని దెప్పి పొడుస్తూ అన్నాడు ఆ వ్యక్తి.


ఆ మాటలు విన్న భవాని చుడండి డాక్టర్ మా పేరెంట్స్ నన్ను పద్దతిగా పెంచారు ఇలా కానీ రోడ్డు మీద పడేయలేదు సో నాకు ప్రాణం విలువ తెలుసు, నా చేతిలో ఒక్కరికి సహాయం చేసే అవకాశం ఉంది అలాంటిది చేయకుండా నా స్వార్థం కోసం నేను ఆలోచించుకుంటూ ఉంటే కొద్దిసేపు ముందు మీకు బ్లడ్ ఇచ్చేదాన్ని కాదుగా... అని చెప్పింది భవాని.


కానీ మేడం మీరు ఇప్పుడే బ్లడ్ ఇచ్చారు మళ్ళీ మీరు బ్లడ్ ఇవ్వాలి అంటే కనీసం ఆరు నెలలు తరువాత ఇవ్వాలి మేడం అని నచ్చచెప్పడానికి చూసాడు డాక్టర్.


ఒక మాట చెప్పండి డాక్టర్ మీ వృత్తి ఏంటి అసలు ఇక్కడ అని సీరియస్ గా చూస్తూ అడిగింది భవాని.


ప్రమాదంలో ఉన్నా ప్రాణాలని కాపాడడం మేడం అని చెప్పాడు డాక్టర్.


కదా ఆపరేషన్ థియేటర్ లో ఒక వ్యక్తి తన ప్రాణం కోసం పోరాడుతున్నాడు ఇప్పుడు మీ వృతత్తికి తగ్గట్లు వెళ్ళి మీ డ్యూటీ మీరు చేయండి ఇక నేను ఒక సాటి మనిషిగా నేను చేయాల్సింది నేను చేస్తాను అని అంటూ ఈసారి నేను కుడా ఆపరేషన్ థియేటర్ లోకి వచ్చి బ్లడ్ ఇస్తాను అని చెబుతూ తను కుడా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళింది భవాని.


సరిగ్గా రెండు గంటలు తరువాత ఒక నర్స్ వచ్చి మేడం ఇవి మీ అబ్బాయి చేతిలో ఉన్నాయి మేడం అని చెబుతూ ఆ నర్స్ వినయ్ ఫోన్ ఇంకా తన పర్స్ ఇంకా ఎంతో ఇష్టంగా భవాని కోసం అతను తీసుకున్న డైమండ్ రింగ్ వినయ్ తల్లి చేతిలోకి ఇచ్చింది ఆ నర్స్.


నర్స్ వినయ్ వస్తువులు వినయ్ తల్లి చేతిలో పెట్టిన మరు క్షేణం భవాని ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చి నేరుగా వినయ్ తల్లి శాంభవి దగ్గరికి వెళ్ళి... చిన్నగా చిరునవ్వు నవ్వుతూ మీ అబ్బాయికి ఎం కాలేదు ఆంటీ ప్రమాదం నుండి బయటపడ్డాడు ఇప్పుడు అతనికి ఎలాంటి ప్రమాదం లేదు డాక్టర్స్ కుట్లు వేస్తున్నారు కాసేపట్లో బయటకి వచ్చి మీ అబ్బాయి ని జనరల్ వార్డ్ లోకి షిఫ్ట్ చేస్తారు అక్కడికి వెళ్ళాక చూడచ్చు అని చెప్పి వాళ్ళకి దైర్యాన్ని ఇచ్చింది భవాని.


భవాని మాటలు విన్న వినయ్ తల్లిదండ్రులు ఒక్కసారిగా వారి కళ్ళలో ఎన్నడూ లేని సంతోషాన్ని కన్నీళ్ల రూపంలో చూపిస్తూ భవాని కి హృదయపూర్వకంగా చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పారు శాంభవి ఇంకా అశోక్ కుమార్.


అయ్యో పెద్దవాళ్ళు మీరు నాకు దండం పెట్టడం ఏంటండీ తప్పు ఇలా చేయకూడదు మీరు అని దండం పెడుతున్న వాళ్ళ చేతులని పట్టుకొని కిందికి దించి... సరే అండి నేను బయలుదేరుతాను నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెబుతూ అక్కడ నుండి బయలుదేరింది భవాని.


ఆలా వెళ్తున్న భవానిని... ఒక నిమిషం కాస్త ఆగు అమ్మ అని పిలిచి భవాని దగ్గరికి వెళ్ళాడు అశోక్ కుమార్.


చెప్పండి అంకుల్ ఎం కావాలి మీకు అని నవ్వుతూ అడిగింది భవాని.


ఏం లేదమ్మ మాకు లేక లేక పుట్టిన మా ఒక్కగానొక అబ్బాయి ప్రాణాలు కాపాడావ్ నువ్వు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు... అని చెబుతూ... తన జేబులో నుండి ఒక బ్లాంక్ చెక్ ని తీసి... ఇదిగో ఇది తీసుకో అమ్మ నా సంతృప్తి కోసం అని చెబుతూ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చాడు అశోక్.


అయ్యో


అంకుల్ నేను మీ అబ్బాయిని కాపాడింది మీ నుండి ఏదో ఆశించి కాదు జస్ట్ నా చేతిలో ఉన్నంతవరకు నేను చేయగలిగే సహాయం నేను చేశాను అంతే కానీ ఇందులో మీరు రుణపడి ఉండాల్సిన అవసరం లేదంకుల్ అని నవ్వుతూ చెప్పింది భవాని.


వద్దనడం నీ సంస్కారం కానీ ఇలా ఎలాంటి సహాయం చేయకుండా సహాయం పొందడం మా పద్దతి కాదు కాదమ్మా అని చేప్పి అతి బలవంతంగా భవానిని ఒప్పించి ఆ బ్లాంక్ చెక్ ని తీసుకునే లా చేసాడు అశోక్ కుమార్.


సరే అంకుల్ అని చెబుతూ భవాని ఆ బ్లాంక్ చెక్ ని తీసుకొని బై అంకుల్ మీ అబ్బాయి జాగ్రత్త అని చెప్పి అక్కడ నుండి నడుచుకుంటూ మెయిన్ డోర్ దాక వెళ్ళింది భవాని...అంతలో భవాని కి రిసెప్షన్ దగ్గర ఒక బాక్స్ కనిపించింది అది చూసి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఆ చెక్ ని ఆ బాక్స్ లో వేసి అక్కడ నుండి వెళ్తుండగా అంతలో రిసెప్షన్ లో ఉన్నా వాళ్ళలో ఒక వ్యక్తి భవానిని చూసి... మేడం అని పిలిచి..


అదేంటి మేడం బాక్స్ లో డొనేషన్ వేసి మీ డీటెయిల్స్ కుడా రాయకుండా వెళ్తున్నారు కనీసం మీ పపేరైనా రాయండి మేడం అని చెబుతూ అడిగింది ఆ నర్స్.


నర్స్ మాటలు విని చిన్నగా నవ్వి నాకు ఈ డబ్బు తో అవసరం లేదు కానీ దీని అవసరం నాకంటే ఎక్కువగా మీరు నడుపుతున్న ఆ ఆర్గనైజేషన్ ద్వారా పొందుతున్న నిస్సహాయంగా ఉన్న ఎందరో ఉన్నారు ఈ డబ్బు నా కంటే వాళ్లకే ఎక్కువగా అవసరం ఉంది కాబట్టి ఈ డబ్బుతో వాళ్లకి సహాయం చేయండి అని చెప్పి ఆ పక్కనే ఉన్నా దేవుడికి దండం పెట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది భవాని.


ఇదంతా దూరం నుండి చూస్తున్నా అశోక్ కుమార్.


వావ్ నిజంగా ఈ కాలంలో కుడా ఇలాంటి వాళ్లు ఉంటారు అంటే నమ్మలేకపోతున్నాను అని భవానీ ని కన్నార్పకుండ చూస్తూ తన మనసులోనే భవానీ కి ఎంతో గౌరవం ఇస్తున్నాడు అశోక్ కుమార్...


అంతలో శాంభవి అశోక్ దగ్గరికి వచ్చి.... ఎంటండీ ఆలా చూస్తున్నారు ఆ అమ్మాయిని అని భవాని వైపుకి చూస్తూ అడిగింది షాంభవి.


ఆ అమ్మాయి ఎవరింటికి కోడలిగా వెళ్తుందో తెలియదు కానీ ఆ ఇల్లు నిజంగా చాలా అదృష్టం చేసుకొని ఉంటుంది అందుకే వాళ్ళకి ఇంత పద్దతి గల అమ్మాయి కోడలిగా చేసుకోబోతున్నారు. అని చెబుతుండగా... అంతలో ఒక డాక్టర్ వొచ్చి...


సార్ మేడం మీ అబ్బాయికి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు అతను ప్రాణాపాయ ప్రమాదం నుండి క్షేమంగా బయట పడ్డాడు మరి కాసేపట్లో అతనికి స్పృహ వస్తుంది వచ్చిన వెంటనే అబ్బాయిని జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేస్తాం అప్పుడు మీరు వెళ్ళి చూడచ్చు అని నవ్వుతూ చెప్పాడు డాక్టర్.


డాక్టర్ చెప్పిన మాటలు విన్న అశోక్ ఇంకా శాంభవి ఇద్దరు ఒక్కసారిగా ఒక నిమిషం షాక్ లో ఉండిపోయారు... ఎందుకంటే సరిగ్గా కొద్ది నిముషాల క్రితం భవాని కుడా ఇదే మాటలు చెప్పింది.


అది చూసిన డాక్టర్... సార్... సార్... మిమ్మల్నే సార్ అని పిలిచాడు డాక్టర్.


డాక్టర్ పిలిచినా పిలుపుకి అశోక్ ఇంకా శాంభవి ఇద్దరు ఒక నిమిషం తరువాత షాక్ నుండి బయటకు వచ్చి... హా చెప్పండి పిలిచారు అని అడిగాడు అశోక్.


ఎం అయింది సార్ మీ అబ్బాయి గురించి ఇంత ముఖ్యమైన విషయం చెబితే ఎం పట్టనట్లు అలా ఉన్నారు ఏమైనా ప్రోబ్లమా అని అడిగాడు డాక్టర్.


అయ్యో


అదేం లేదు మా అబ్బాయికి బ్లడ్ ఇచ్చి వాడి ప్రాణాలతో పాటు మా ప్రాణాలు కూడా కాపాడిన ఆ అమ్మాయిని చూస్తున్నాం అని చెప్పాడు అశోక్.


హా అవును సార్ నిజంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్లు ఎంత పద్దతిగా పెంచకపోతే ఆ అమ్మాయి ఇంత సంస్కారంగా ఎలా ఉంటుంది చెప్పండి అని భవాని ని పొగుడుతూ సరే సార్ నేను వెళ్ళి మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్.


వినయ్ ని జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేసారు, షిఫ్ట్ చేసిన సరిగ్గ ముడు గంటలు తరువాత అంటే ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిముషాలకి వినయ్ కి స్పృహ వచ్చింది, అక్కడే ఉన్న వినయ్ తల్లి శాంభవి అది గ్రహించి వెంటనే అశోక్ కి చెప్పింది.


అది విన్న అశోక్ మాటల్లో చెప్పలేనంత సంతోషంతో తన కళ్ళు చెమ్మగిల్లాయి వెంటనే ఇక ఆలస్యం చేయకూడదు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ని పిలుచుకొని వచ్చాడు అశోక్. డాక్టర్ పూర్తిగా చెక్ చేసి... ఇక భయపడాల్సిన అవసరం లేదు అంది, మీ అబ్బాయి ఇప్పుడు పూర్తిగా ప్రమాదం నుండి బయటపడ్డాడు కొద్ది రోజుల్లో అతనిని డిశ్చార్జ్ చేస్తాము మీరు అతనిని ఇంటికి తీసుకెళ్లచ్చు అని చెబుతూ కొన్ని మెడిసిన్స్ రాస్తాను తుచాతప్పకుండ వాడండి ఇంకా ఫాస్టుగా రికవరీ అవుతాడు అని చేప్పి వాళ్ళ ముందే ఒక మందుల చీటి రాసి వాళ్ళకిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయింది డాక్టర్.


శాంభవి వెంటనే ఏడుస్తూ..... నీకు చెప్పానుగా బయటకు వెళ్ళకు రా వెళ్తే ఇదిగో ఇలాగే అవుతుంది అని కానీ నేనెంత చేప్పిన నా మాట లెక్కచేయకుండా మొండిగా బయటకు వెళ్ళావ్ ఇప్పుడు చూడు ఎం అయ్యిందో అని కన్నీళ్ళు కారుస్తూ అంది శాంభవి.


అది విన్న వినయ్.... అబ్బా అమ్మ వదిలేయ్ అమ్మ జరిగిందేదో జరిగింది ఇక దాని గురించి మర్చిపో ఇప్పుడు చూడు బాగానే ఉన్నానుగా అని శాంభవి కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు వినయ్.


నీ మొఖం బాగున్నావ్ నువ్వు కళ్లు తెరిచేదాకా క్షణం క్షణం ఎంత నరకయాతన అనుభవించామో నీకెం తెలుసు మా స్థానంలో నువ్వు ఉంటే తెలుస్తుంది నీకు అని కోపంగా చూస్తూ, నువ్వు బాగాయ్యావంటే ఆ అమ్మాయి కారణంగానే తనే లేకపోయింటే ఈరోజు నువ్వు మాకు దక్కేవాడివే కాదు రెండు సార్లు ఆ అమ్మాయి తన రక్తం ఇచ్చి ఆపరేషన్ లో దగ్గరుండి మరి నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ మాకు ఎంతో దైర్యం చెప్పి మాకు నిన్ను క్షేమంగా అప్పగించింది.... నిజంగా ఆ అమ్మాయి నీ ప్రాణాలు కాపాడిన దేవత, నువ్వే కాదు నీతో పాటు మా ప్రాణాలు కుడా కాపాడిన దేవత తను అని అంది శాంభవి.


అవునా ఆ అమ్మాయి పేరేంటి అమ్మ అని నీరసంగా అడిగాడు వినయ్.


అయ్యాయ్యో హడావిడిలో పడి ఆ అమ్మాయి పేరే మర్చిపోయాను బహుశా మీ నాన్నకి తెలుసు అనుకుంటా మందులు తేవటానికి వెళ్ళారు కదా రాగానే అడుగుతా ఆ అమ్మాయి వెళ్లే ముందు ఆ అమ్మాయితో మాట్లాడడం చూసాను అని అంది శాంభవి.


ఒహ్హ్ అవునా సరే అమ్మ అని అంటూ అమ్మ కాస్త దాహంగా ఉంది కొంచెం వాటర్ ఇస్తావా అని అడిగాడు వినయ్.


హా ఇస్తాను అని అంటూ టేబుల్ పక్కనే ఉన్నా వాటర్ బాటిల్ ని తీసుకొని గ్లాస్ లో పోసి తన చేతులకి ఇవ్వకుండా తానే స్వయంగా తాగించింది శాంభవి.


అంతలో అశోక్ మందులు తీసుకోని వచ్చాడు.


హాయ్ నాన్న అని చిన్నగా నవ్వుతూ నిరసంగా పలకరించాడు వినయ్ నాతో మాట్లాడకు అని చెమ్మగిల్లిన కళ్ళతో కోపంగా చూస్తూ అన్నాడు అశోక్.


ఎం అయింది నాన్న నాతో మాట్లాడరా అని అడిగాడు వినయ్.


ఎందుకు మాట్లాడాలి.... దేని గురించి మాట్లాడాలి ఎప్పుడు చూసిన ననీకు నచ్చిందే చేయడం కానీ మా మాట ఒక్కసారైనా విన్నావా నువ్వు చెప్పింది వింటూ నీతో మాట్లాడటానికి ఆరే మా అనుభవం కంటే ఎక్కువనా నీ అనుభవం నీ వయసు, పేరు కి పెద్ద యూత్, తోప్ అని చెప్పుకొని తిరగడం కాదు పెద్దల మాటలు విని వాళ్లు చెప్పింది నడుచుకుంటూ వెళ్ళడం కుడా యూత్ యొక్క భాద్యత కానీ అది మీరు అసలు చేయరే ఏమైనా చాలు ఎక్కడి లేని ఇగో పౌరుషం పొంగుకొస్తుంది ఎదో మీ సంపాదనతో బ్రతుకున్నట్లు అని చివాట్లు పెడుతూ అన్నాడు అశోక్.


అబ్బా ఊరుకోండి ఆ దేవుడి దయతో వాడు మనకి దక్కాడు ఇప్పుడు వాడికి రెస్ట్ చాలా అవసరం అండి ఎందుకని మిరలా వాడి మీద కోప్పడుతూ వాడిని బాధపెడతారు.... అని అంది శాంభవి.


అమ్మ నాన్నది కోపం కాదు భాద నేనెక్కడ దూరం అయిపోతానేమో అని భయం అంతేకాని నా మీద కోపంతో అనట్లేదు అని చెబుతూ చిన్నగా నవ్వుతూ అన్నాడు వినయ్.


అంతలో శాంభవి కి ఒక విషయం గుర్తొచ్చి... ఆ ఏవండీ ఇందాక ఒక అమ్మాయి మన అబ్బాయికి బ్లడ్ ఇచ్చి కాపాడింది కదా, ఆ అమ్మాయి పేరేంటి అంది, అంటే నేను కంగారులో పడి అడగడం మర్చిపోయాను అని అంది శాంభవి.


తెలియదే పేరు అడిగితే ఒక మాట చేప్పి వెళ్ళిపోయింది బ్లాంక్ చెక్ ఇచ్చిన దాన్ని తీసుకెళ్లి రిసెప్షన్ లో ఉన్నా చారిటీ ఆర్గనైజేషన్ బాక్స్ లో వేసి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి చూస్తే అందులో కుడా తన పేరు, ఊరు డీటెయిల్స్ ఏమి రాయలేదు అని చెప్పాడు అశోక్.


అవునా మరి పేరు అడిగితే ఎం చెప్పింది ఆ అమ్మాయి, అని ఎంతో ఆత్రుతగా అడిగింది శాంభవి.


సహాయం పొందడం ముఖ్యం కానీ అది ఎవరితో పొందుతున్నామో, ఎందుకు పొందుతున్నామో అది ముఖ్యం కాదుగా ఒక మనిషికి సాటి మనిషికి నా వీలైనంత సహాయం చేయగలిగాను అది చాలు నాకు అంతకుమించి ఎం కావాలి నాకు, ఐనా నేను సహాయం చేసింది నా పేరు చెప్పుకొని జీవితాంతం నన్ను గుర్తు పెట్టుకోండి అని చెప్పడానికి కాదు, సాటి మనిషిగా మానవత్వంతో చేశాను అని చెప్పి వెళ్లిపోయింది ఆ అమ్మాయి.


అని చెప్పాడు అశోక్.


ఒహ్హ్ అవునా ఈ కాలంలో కూడా అంత గొప్ప ఆలోచనతో ఉన్నారు అంటే ఆ అమ్మాయిని ఎంత పద్దతిగా పెంచారో అని అంటూ ఆశ్చర్యంగా అంది షాంభవి.


సరే ఇప్పటికే చాలా ఆలస్యం అయింది నువ్వు కాసేపు పడుకో అని చెప్పి వినయ్ ని పడుకోబెట్టింది షాంభవి.


సరిగ్గా ముడు గంటలు తరువాత వినయ్ ఫ్రెండ్స్ హాస్పిటల్ కి వచ్చారు వచ్చి వినయ్ ని పలకరించారు....ఎలా ఉన్నారో కనుక్కొని వినయ్ వాల్ల పేరెంట్స్ ని అడిగారు ఎం అయింది అని.


శాంభవి జరిగిందంత చెప్పింది అంతా విన్న వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అయ్యారు ఆలా కొద్ది సేపు మాట్లాడుకొని... సరే రవీ కాస్త మా వాడిని చూసుకుంటారా మేము ఇంటికి వెళ్ళి వాడికి టిఫిన్ తీసుకొస్తాం అని చేప్పి ఇంటికి వెళ్ళారు శాంభవి ఇంకా అశోక్.


ఆలా కొన్ని రోజులు గడిచాక వినయ్ ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు హాస్పిటల్ వాళ్లు.


ఇంటికి వచ్చాక సరిగ్గా రెండు రోజులు తరువాత గాఢ నిద్రలో ఉండగా సాడెన్గా తనకి ఒక విషయం గుర్తొచ్చింది దాంతో ఒక్కసారిగా ఎదో పెద్ద పిడుగు పడినట్లు ఉలిక్కిపడి నిద్ర లేచాడు వినయ్.


              కొనసాగుతుంది 




Rate this content
Log in

Similar telugu story from Drama